రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో కనిపించారు. వీరిద్దరు తెలుగు ప్రజలకు తెలిసిన విప్లవ వీరులు. చిన్న తనంలోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వీరులు. వీరిద్దరి కథ అనగానే జనాల్లో ఒకింత అటెన్షన్ క్రియేట్ అయ్యింది.
పేర్లు అయితే అవే కాని పాత్రలు పూర్తిగా విభిన్నం.. వారి కథ నూటిని నూరు శాతం కల్పితం. ఇద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్ విషయంలో రాజమౌళి సక్సెస్ అయ్యారు. అయితే రామ్ చరణ్ ను క్లైమాక్స్ లో అల్లూరి సీతారామరాజుగా రాజమౌళి చూపించి వావ్ అనిపించాడు. తెలుగు వారికి అల్లూరి తెలుసు.. ఎలా ఉంటాడు.. ఆయన ఏంటీ అనేది ఒక అవగాహన ఉంది కనుక రామ్ చరణ్ లో అల్లూరిని చూశారు.
కాని హిందీ ప్రేక్షకులు మాత్రం రామ్ చరణ్ ను క్లైమాక్స్ లో చూసి శ్రీరాముడిగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామాయణం తీస్తే రాముడి పాత్రకు రామ్ చరణ్ అద్బుతంగా సెట్ అవుతాడు అన్నట్లుగా ఇప్పుడు అక్కడ చర్చ జరుగుతుందట. రామ్ చరణ్ లుక్ అల్లూరి అని కాకుండా శ్రీరాముడి తరహాలో అక్కడ ఉందనే వాదన వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇద్దరు కూడా వారి వారి పాత్రలకు వందకు వంద శాతం న్యాయం చేశారు అనడంలో సందేహం లేదు. వారితో రాజమౌళి అలా చేయించుకున్నారు. ఆయన యొక్క గొప్పతనమే అది. కాని అల్లూరి పాత్రను హిందీ ప్రేక్షకులు శ్రీరాముడు అనుకుంటున్నారు అనే విషయం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. అల్లూరి గురించి అక్కడ ఎక్కువ శాతం పబ్లిసిటీ చేయక పోవడం.. మన స్వాతంత్ర్య సమరయోధుడు అనే విషయం వారికి తెలియక పోవడం వల్లే ఈ పరిస్థితి.
ఎవరు ఏం అనుకున్నా కూడా పాజిటివ్ గానే అనుకుంటున్నారు. కనుక ఇబ్బంది లేదు. నెట్టింట ఇద్దరు హీరోల లుక్స్ కు సంబంధించిన చర్చల్లో నెగిటివ్ ఎక్కడ లేదు. ప్రతి చోట కూడా పాజిటివ్ గానే మాట్లడుకుంటున్నారు. రామ్ చరణ్ క్లైమాక్స్ లుక్ ను శ్రీరాముడు అనుకోవడం లో తప్పేం లేదు. ఆ విల్లు.. హెయిర్ స్టైల్ రూపం ఇలా ప్రతి ఒక్కటి కూడా రాముడి తరహాలో ఉన్నాయి.
ఇక్కడి ప్రేక్షకులు కూడా ఆమద్య ఒక భారీ రామాయణం సినిమాను అల్లు అరవింద్ మరియు కొందరు తీస్తాం అన్నారు కదా.. ఆ సినిమా లో రామ్ చరణ్ ను రాముడిగా తీసుకోవచ్చు. ఈ సినిమా తో తాను రాముడి పాత్రకు న్యాయం చేయగలను అంటూ నిరూపించుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి జక్కన్న రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లను ప్రేక్షకులకు సరికొత్తగా చూపించడంతో పాటు నచ్చే విధంగా చూపించడంతో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.