టాలీవుడ్‌ పై ఎంత సున్నితంగా విమర్శలు చేసింది చూడండి

Update: 2022-03-29 11:30 GMT
తెలుగు ప్రేక్షకులకు ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఈ అమ్మడు తెలుగు లో పలు సినిమాల్లో నటించినా స్టార్‌ హీరోయిన్ రేంజ్ కు వెళ్లడం లో మాత్రం విఫలం అయ్యింది. తెలుగు లో ఈమె చేసిన సినిమాలు కొన్ని మంచి విజయాలను సొంతం చేసుకున్నా కూడా అదృష్టం కలిసి రాలేదు. దాంతో స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు ఈ అమ్మడికి దక్కలేదు.

స్టార్స్ కు జోడీగా నటించే అవకాశం దక్కక పోయినా కూడా ఈమెకు రెగ్యులర్‌ గా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఒకటి రెండు పెద్ద సినిమాల్లో నటించినా అవి పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్రలు కాకపోవడంతో ఈమె కెరీర్‌ అలా అలా సాగుతూ వస్తోంది. ఇక రాశి ఖన్నా హీరోయిన్ గా చేస్తున్న సినిమా లు ప్రస్తుతం కూడా చాలానే ఉన్నాయి. అయితే అందులో మెజార్టీ శాతం పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రల్లోనే ఈమె కనిపిస్తుంది.

తెలుగు తో పాటు తమిళంలో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించింది.. ప్రస్తుతం కూడా పలు సినిమాల్లో నటిస్తుంది. బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ సినిమాల్లో ఈ అమ్మడు నటించలేక పోతుంది.. కాని కమర్షియల్‌గ ఆ ఈ అమ్మడు కెరీర్‌ ను నెట్టుకు వస్తుంది. ఈ సమయంలో తన గత సినిమాల గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా.. టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ పై విమర్శించినట్లుగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా రాశి ఖన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్‌ సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్స్ కు కమర్షియల్‌ పాత్రలే దక్కుతాయి. హీరోయిన్‌ లు ఎక్కువ శాతం హీరోల పక్కన నటించి.. రెండు మూడు పాటల్లో కనిపించి పక్కకు వెళ్లి పోతారు. నేను అలా నటించేందుకు ఇష్టపడను. కాని తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించిన తర్వాత నాకు ఆ పద్దతి అలవాటు అయ్యింది.

ఇష్టం లేకున్నా కూడా తప్పని సరి పరిస్థితుల్లో సౌత్ లో ఆ పాత్రలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు టాలీవుడ్‌ లో కమర్షియల్‌ పాత్రలు మాత్రమే దక్కాయి అంటూ సున్నితంగా రాశి ఖన్నా చేసిన విమర్శలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక టాలీవుడ్‌ లో అయినా మరెక్కడైనా కూడా ఇక నుండి కథల ఎంపిక విషయంలో జాగ్రత్త తీసుకుంటాను అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

ఇంతకు ముందు తరహా లో కాకుండా పూర్తి కమర్షియల్‌ పాత్రల్లో నటించకుండా.. పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమా లో నటిస్తాను.. అలాగే నటనకు ఆస్కారం ఉన్న సినిమాలకు కమిట్‌ అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇలా భీష్మించుకు కూర్చుంటే ఇప్పటికే కొద్దిగొప్ప వస్తున్న ఆఫర్లు కాస్త తగ్గుతాయి అనేది కొందరి అభిప్రాయం.
Tags:    

Similar News