ది కశ్మీర్‌ ఫైల్స్ : వర్మ కెరీర్‌ లో మొదటి సారి ఆ పని చేశాడు

Update: 2022-03-22 04:49 GMT
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ది కశ్మీర్‌ ఫైల్స్ అనే సినిమా గురించి చర్చ జరుగుతోంది. సినిమాకు కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే.. ఎక్కువ శాతం మంది అనుకూలంగా మాట్లాడుతున్నారు. కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ఈ సినిమాకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులకు ఈ సినిమా చూసేందుకు ఏకంగా సెలవు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ మరియు నెగెటివ్ టాక్ తో ఏకంగా రూ. 250 కోట్ల వసూళ్లను ఇప్పటి వరకు నమోదు చేసిందని లాంగ్‌ రన్‌ లో రూ. 300 కోట్ల వసూళ్లు నమోదు చేసినా ఆశ్చర్యం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది.

ఇప్పటివరకు హిందీలోనే దేశ వ్యాప్తంగా స్క్రీనింగ్ అవుతున్న ఈ సినిమా అతి త్వరలోనే రీజినల్ లాంగ్వేజ్ లో కూడా డబ్బింగ్ అయ్యి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రతి ఒక్క భారతీయుడు చూడాలంటూ చిత్ర యూనిట్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ పై వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

ఆయన సినిమాపై ప్రశంసలు కురిపించడంతో పాటు ఒక అద్భుతమైన సినిమా అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా చిత్ర దర్శకుడు వివేక్ రంజన్‌ అగ్నిహోత్రి.. రామ్ గోపాల్ వర్మ సినిమాకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను షేర్ చేశాడు. ఐ హేట్ ది కశ్మీర్‌ ఫైల్స్ అంటూ ఆయన రివ్యూ ని మొదలు పెట్టాడు. తన ఇన్ని సంవత్సరాల సినీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక సినిమాకు రివ్యూ ఇవ్వలేదు. కానీ మొదటి సారి ఈ సినిమాకు నేను స్పందించాలని భావిస్తున్నాను.

ఈ సినిమాకు సంబంధించిన వివాదాల గురించి లేదా ఈ సినిమాలో ఉన్న వివాదాస్పద అంశాల గురించి నేను మాట్లాడాలి అనుకోవడం లేదు. ఈ సినిమాలోని కంటెంట్ ను నేను ఓన్‌ చేసుకున్నాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా గురించి కెరియర్లోనే మొదటి సారి మాట్లాడేందుకు... రివ్యూ ఇచ్చేందుకు ముందుకు వచ్చాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. సినిమా కంటెంట్ విషయం లో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా పని చేశారని వర్మ పేర్కొన్నాడు.

సినిమాలో ఎక్కడా కూడా ప్రేక్షకులకు అయ్యే అంశాలను చూపించకుండా అసలు పాయింట్ ని చూపిస్తూ సినిమాను నడిపించిన తీరు బాగుంది అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. మొత్తానికి వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి అంటూ నెటిజెన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఉన్న అంచనాలు భారీ వసూళ్లను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలతో కచ్చితంగా వసూలు మరింతగా పెరుగుతాయి అని నమ్మకం వ్యక్తం అవుతుంది. రెండోవారం ముగింపు దశలో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. మూడవ వారం కూడా ఈ సినిమా ఖచ్చితంగా మంచి వసూళ్లను దక్కించుకుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Full ViewFull View
Tags:    

Similar News