దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ శుక్రవారం(మార్చి 25) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది.
అందరూ ఊహించినట్లుగానే RRR మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా.. తొలి రోజు వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
'బాహుబలి 2' తర్వాత ఫస్ట్ డే 200 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమాగా 'ఆర్.ఆర్.ఆర్' నిలిచింది. ఈ రెండు సినిమాలు కూడా జక్కన్న తెరకెక్కించిన సినిమాలే కావడం విశేషం. ఇక యూఎస్ఏలో ప్రీమియర్స్ తో $ 3 మిలియన్ అందుకున్న మొదటి భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
యూఎస్ లో ప్రీమియర్స్ మరియు ఓపెనింగ్ డే కలుపుకొని RRR కలెక్షన్స్ 5 మిలియన్ల డాలర్ల మార్కును క్రాస్ చేసింది. అమెరికాలో ఏ భారతీయ సినిమాకైనా ఇదే ఆల్ టైమ్ రికార్డ్. ఇంతకముందు 'బాహుబలి 2' అక్కడ 4.59 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో 4.03 కోట్లు రాబట్టి 'బ్యాట్ మ్యాన్' ను ఓవర్ టేక్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ 'ఆర్.ఆర్.ఆర్' సినిమా భారీ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 కోట్లు అందుకున్న మొదటి చిత్రంగా నిలిచింది. అలానే నైజాంలో 23.30 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే షేర్ మూవీగా సంచలనం సృష్టించింది.
'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు సంబంధించి అధికారిక లెక్కలు వెలువడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. మరి 'బాహుబలి 2' కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
ఇకపోతే RRR చిత్రంతో మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి మరోసారి వెండితెరపై మరో విజువల్ వండర్ ని క్రియేట్ చేశారని ఆడియన్స్ చెబుతున్నారు. చరణ్ - తారక్ ల అద్భుతమైన పెర్ఫార్మన్స్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
1920 కాలంలో బ్రిటీష్ వారిని ఎదిరించిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల స్పూర్తితో కల్పిత కథతో రూపొందిన చిత్రం RRR. విజయేంద్ర ప్రసాద్ ఈ కథ రాయగా.. బుర్రా సాయి మాధవ్ మాటలు అందించారు.
ఇందులో ఆలియా భట్ - అజయ్ దేవగణ్ వంటి బాలీవుడ్ తారలు.. రే స్టీవెన్ సన్ - అలిసన్ డూడి - ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు. సముద్ర ఖని - శ్రియా శరన్ - రాజీవ్ కనకాల - రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
డీవీవీ దానయ్య దాదాపు 450 కోట్లకు పైగా బడ్జెట్ తో హై టెక్నికల్ వేల్యూస్ తో RRR సినిమాను రూపొందించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.