సర్కారు వారి పాట కౌంట్‌ డౌన్ షురూ గురూ!

Update: 2022-04-12 10:30 GMT
సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. గత ఏడాది కాలంగా ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. సరిగ్గా నెల రోజుల టైమ్ ఉన్న కారణంగా అభిమానులు కౌంట్ డౌన్ షురూ చేశారు.

మహేష్ బాబు గత చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా తో సూపర్ హిట్ ను దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత వెంటనే ఈ సినిమాను షురూ చేసినా కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది. గీత గోవిందం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. సర్కారు వారి పాట సినిమా పూర్తిగా బ్యాంకింగ్ రంగం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

ఇప్పటికే రెండు పాటలు సినిమా నుండి విడుదల అయ్యాయి. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో ఇప్పటికే మంచి స్పందన దక్కించుకుంది. మొదటి రెండు పాటలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో మూడవ పాట విడుదల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ మూడవ పాట కూడా విడుదల కాబోతున్నట్లుగా స్వయంగా థమన్‌ నుండి ప్రకటన వచ్చింది.

మూడవ పాట ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలకు చాలా విభిన్నంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మే 12వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి అని.. అతి త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా ముగించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

మహేష్‌ బాబు.. కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. అతి త్వరలోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రమోషన్ కార్యక్రమాలను చాలా యాక్టివ్‌ గా నిర్వహించబోతున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయబోతున్నారు. మహేష్ బాబు లుక్ మరియు కీర్తి సురేష్ తో ఆయన రొమాన్స్ సినిమాకు ప్రథాన ఆకర్షణ గా ఉంటుందంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చాలా యాక్టివ్ గా చేయాలనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు తదుపరి సినిమా షూటింగ్‌ వాయిదా వేశారట.
Tags:    

Similar News