ఆయనో స్టార్ డైరెక్టర్, ఎంతో మంది నూతన నటీనటులని, హీరోలని, టెక్నిషియన్ లని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాంటి డైరెక్టర్ కే ఓ స్టార్ ప్రొడ్యూసర్ తనయుడు చుక్కలు చూపిస్తున్నాడా? అంటే టాలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. చాలా కాలంగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ తన తనయుడిని హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ లు వేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఓ పేరున్న డైరెక్టర్, గతంలో చాలా మందిని హీరోలుగా, విలన్ లుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు సదరు స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిని హీరోగా పరిచయం చేస్తానని బాథ్యతల్ని తీసుకున్నారు.
పెద్ద కుమారుడు హీరోగా సెటిల్ కావడంతో చిన్న కుమారుడి కెరీర్ పై దృష్టిపెట్టిన సదరు నిర్మాత ఆ బాధ్యతల్ని పేరున్న దర్శకుడికి అప్పగించారు. దీంతో సదరు డైరెక్టర్ సైలెంట్ గా ఈ మూవీని స్టార్ట్ చేసేశాడు. చక చక పూర్తి చేయడం మొదలుపెట్టాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ ని విడుదల చేశారు. ప్రీ లుక్ అందరిని ఆకట్టుకుంది. షూటింగ్ మరో వారం రోజుల్లో చిత్రీకరణ పూర్తి కాబోతోంది. అయితే ఈ సమయంలోనే సదరు స్టార్ ప్రొడ్యేసర్ తనయుడు డైరెక్టర్ కు కాకమ్మ కబుర్లు చెబుతూ షూటింగ్ కు డుమ్మా కొడుతున్నాడట.
కాలు నొప్పి.. కన్ను నొప్పి అని కుంటి సాకులు చెబుతూ దర్శకుడు సహనాన్ని పరీక్షిస్తున్నాడట. ఇంతకీ సదరు హీరో కుంటి సాకులు చెబుతూ షూటింగ్ హాజరు కాకుండా ఏం చేస్తున్నాడా? అని ఆరాతీస్తే ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకుంటూ సరదాగా చిల్ అవుతున్నాడని తెలిసిందట. దీంతో ఆగ్రహించిన దర్శకుడు ఈ విషయాన్ని హీరో తండ్రి, స్టార్ ప్రొడ్యూసర్ దృష్టికి తీసుకెళ్లి అతన్ని దారిలోకి తీసుకురావాలనుకుంటున్నారట.
దర్శకుడిగా అతనికి వున్న ట్రాక్ రికార్డ్ వేరు. యాక్టింగ్ నచ్చకపోతే తనకు కావాల్సిన అవుట్ పుట్ విషయంలో ఆర్టిస్ట్ లని, యంగ్ హీరోలని కొట్టి మరీ చేయించుకున్న ఆయన సదరు స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు చేస్తున్న వెకిలి చేష్టల కారణంగా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారట. అసలే కెరీర్ గాడితప్పిన సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ తనయుడు సదరు డైరెక్టర్ తో ఆడుకోవడం ఇప్పడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఇదిలా వుంటే తొలి సినిమా విషయంలోనే డైరెక్టర్ కు చుక్కులు చూపిస్తున్న ప్రొడ్యూసర్ వారసుడితో సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో సినిమా అని కమిట్ కావాలనుకున్న వాళ్లంతా తాజా ఉదంతం కారణంగా సైలెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతా అంటున్నారు.