అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో రూపొందిన పుష్ప సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. అనూహ్యంగా పుష్ప 300 కోట్ల రూపాయల వసూళ్లకు పైగా దక్కించుకోవడంతో పార్ట్ 2 పై ఆసక్తి భారీగా పెరిగింది. మొదటి పార్ట్ ను బీట్ చేసే స్థాయిలోనే పార్ట్ 2 ఉండాలి. అలా ఉంటేనే అభిమానులు ఏమైనా సంతృప్తి చెందుతారు. కాని పుష్ప పార్ట్ 1 ను రీచ్ అవ్వడం అంటే చాలా కష్టం అవ్వచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
పుష్ప సినిమాను మొదట సింగిల్ పార్ట్ గానే తెరకెక్కించాలనుకున్నారు. దర్శకుడు సుకుమార్ మొదట అనుకున్న కథ ప్రకారం నెగటివ్ క్లైమాక్స్ ను రాసుకున్నాడట. కాని రెండవ పార్ట్ కు నెగటివ్ క్లైమాక్స్ ఉంటే సెట్ అయ్యేనా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేయడంతో పాటు సుకుమార్ కూడా ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. దాంతో క్లైమాక్స్ విషయంలో గత కొన్ని నెలలుగా సుకుమార్ కిందా మీదా పడుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ పలు వర్షన్ ల క్లైమాక్స్ ను రాసుకున్నాడట. అందులో కొన్ని ఆయనకే నచ్చడం లేదని.. కొన్ని టీమ్ కు సంతృప్తిని కలిగించడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కథ మొత్తం అల్లు అర్జున్ మరియు ఫాహద్ ఫాసిల్ ల నడుమ ఉంటుంది. అలాగే మొదటి పార్ట్ లో కనిపించిన వారి పాత్రలను కూడా కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఆ పాత్రలను ఎలా కంటిన్యూ చేయాలని కూడా సుకుమార్ చర్చలు సాగిస్తున్నాడట.
మొదటి పార్ట్ ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్లే ఒకటికి రెండు సార్లు సుకుమార్ ఆలోచిస్తున్నాడనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. పార్ట్ 2 చిత్రీకరణ ప్రారంభంకు ఇంకాస్త సమయం ఉంది కనుక అప్పటి వరకు స్క్రిప్ట్ లో మరియు క్లైమాక్స్ లో కూడా మళ్లీ మళ్లీ మార్పులు చేర్పులు చేసే అవకాశాలు లేకపోలేదు అంటూ మైత్రి మూవీ మేకర్స్ నుండి టాక్ వినిపిస్తుంది.
పుష్ప పార్ట్ 1 విడుదలకు ముందే పార్ట్ 2 కి సుకుమార్ కథను రాసుకున్నట్లుగా గతంలో నిర్మాతలు వెళ్లడించారు. కాని ఇప్పుడు మళ్లీ కొత్తగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను ప్లాన్ చేస్తున్నాడని.. అందుకే కథ ను మళ్లీ మార్చాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. సుకుమార్ ఏం చేసినా పర్వాలేదు.. ఆలస్యం అయినా పర్వాలేదు కాని పుష్ప పార్ట్ 2 మాత్రం అంతకు మించి అన్నట్లుగా ఉండాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
మొదటి పార్ట్ లో రష్మిక ను అల్లు అర్జున్ పెళ్లి చేసుకున్నాడు. కనుక ఇద్దరి మద్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా రొటీన్ గా కాకుండా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేయాలి. ఇక ఐటెం సాంగ్ విషయంలో పార్ట్ 1 ను మించిన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క విషయం కూడా పార్ట్ 1 తో పోలి అంతకు మించి ఉండాలంటూ ప్రతి ఒక్కరు డిమాండ్ చేసే అవకాశం ఉంది కనుకు సుకుమార్ కు ఆ స్థాయికి చేర్చడం అంటే పెద్ద కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమా ను ఏప్రిల్ లో పట్టాలెక్కిస్తే డిసెంబర్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.