శర్వానంద్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగానే వస్తుంటారు. శర్వానంద్ అలాంటి కథలను .. పాత్రలను ఎంచుకుంటూ రావడమే అందుకు కారణం. ఆయన కథల్లోను .. పాత్రలలోను హడావిడి కనిపించదు. నిండుదనం .. నిదానం ఉంటాయి .. పాత్రలు నిలకడగా కనిపిస్తాయి. అలాంటి శర్వానంద్ కొంతకాలంగా తన ఇమేజ్ కి దూరంగా సినిమాలు చేస్తూ వెళ్లాడు. ఫలితంగా అవి ఆశించిన ప్రయోజనాన్ని అందుకోలేకపోయాయి.
ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన శర్వానంద్, ఈ సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లోనే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చేశాడు. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. శర్వానంద్ సరసన నాయికగా రష్మిక నటించిన ఈ సినిమా వచ్చేనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. సుకుమార్ .. సాయిపల్లవి .. కీర్తి సురేశ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుక చాలా సందడిగా జరిగింది.
ఈ వేదికపై శర్వానంద్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో రాధిక గారు .. ఖుష్బూ గారు .. ఊర్వశి గారు వంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందువలన సెంటిమెంట్ ఒక రేంజ్ లో ఉంటుందనే అంతా అనుకుంటారు. ఎమోషన్స్ భయంకరంగా ఉంటాయని భావిస్తారు. సాధారణంగా కాస్త ఆడవాళ్లు ఎక్కువగా కనిపించే సినిమాల్లో అంతా కలిసి సెంటిమెంట్ సీన్లో ప్రేక్షకులను పిండేస్తారనే అనుకుంటారు. కానీ ఈ సినిమాలో అలాంటివేం ఉండేవు. కథ అంతా కూడా చాలా సరదాగా నాన్ స్టాప్ ఫన్ తో సాగిపోతుంది.
ఈ సినిమాలో ఆడాళ్లంతా కలిసి నన్ను పిండేస్తారు .. అలాంటి సీన్స్ తో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అందువలన మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూనే ఉంటారు. చాలా రోజుల తరువాత నా సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే ఎంటర్టైన్మెంట్ ను నేను ఇచ్చాననే అనుకుంటున్నాను.
నా కెరియర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. రష్మిక ఎంత బాగా చేసిందనేది సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.