ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల ఫైనల్ డెస్టినేషన్ 'పాన్ ఇండియా' అనే విధంగా మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా తమ మార్కెట్ ని జాతీయ స్థాయిలో విస్తరించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ అనిపించుకోడానికి సాయశక్తులా ట్రై చేస్తున్నారు.
ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకోగా.. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో ఎన్టీఆర్ - రామ్ చరణ్ అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇటీవల అల్లు అర్జున్ సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా మారాడు. 'పుష్ప: ది రైజ్' చిత్రంతో బన్నీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
ముఖ్యంగా హిందీ బెల్ట్ లో పుష్పరాజ్ ఎవరూ ఊహించని రేంజ్ లో వసూళ్ళు రాబట్టాడు. సరైన ప్రమోషన్స్ లేకున్నా వంద కోట్లకు పైగా వసూళ్ళు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టి బన్నీ పై పడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోకి బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయని టాక్ బయటి వచ్చింది. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు ఊతం ఇచ్చేలా సోమవారం అల్లు అర్జున్ ముంబైలో బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని మీట్ అయ్యారు.
దీంతో బాలీవుడ్ లో ఎన్నో కళాత్మక చిత్రాల్ని, చారిత్రక చిత్రాల్ని తెరకెక్కించిన భన్సాలీతో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒక దక్షిణాది యోధుని జీవిత చరిత్ర ఆధారంగా భన్సాలీ ఒక పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని.., అందులో బన్నీనే హీరో అని అంటున్నారు.
ఇందులో నిజమెంతో అని అభిమానులు వాకబు చేస్తున్న తరుణంలో మంగళవారం 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ సమావేశమవడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే బన్నీ లైనప్ లో మరికొందరు క్రేజీ డైరెక్టర్లు ఉన్నట్లు టాక్. త్వరలో స్ట్రెయిట్ హిందీ ఫిలిం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' ని సెట్స్ మీదకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో పార్ట్-1 కు మించి ఉండేలా రెండో భాగాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో రాబోయే రోజుల్లో బన్నీ నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై క్లారిటీ రానుంది.