మెగాస్టార్ చిరంజీవి స్పీడు పెంచేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నారు. దీంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చిరు ఊహించని విధంగా వరుస ట్రీట్ లు అందించడానికి రెడీ అయిపోవడంతో ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఐదు చిత్రాల్ని లైన్ లో పెట్టారు. ఇందులో ఇప్పటికే `ఆచార్య` చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్ లో విడుదలకు రెడీ అవుతోంది.
గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు), భోళా శంకర్ చిత్రాలు చిత్రీకరణ దశలో వున్నాయి. ఈ మూడు చిత్రాల్లో `భోళా శంకర్` రిలీజ్ టైమ్ ని లాక్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈమూవీని తమిళ బ్లాక్ బస్టర్ `వేదాలం` ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తమిళంలో అజిత్ హీరోగా నటించారు. లక్ష్మీ మీనన్ చెల్లెలుగా నటించింది.
సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో అన్నా చెల్లెల్లుగా మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్ నటిస్తున్నారు. హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ ని `వైబ్ ఆఫ్ భోళా` పేరుతో మంగళవారం విడుదల చేసింది. జీప్ ముందు స్టైలిష్ గా కూర్చుని కనిపిస్తున్న మెగాస్టార్ లుక్ ప్రేక్షకులతో పాటు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఆద్యంతం కుటుంబ భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రం `వేదాలం` ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ మాతృకలో సెంటిమెంట్ అంశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ప్రధాన హైలైట్ గా నిలిచాయి. తెలుగు రీమేక్ లో అంతకు మించి యాక్షన్ ఘట్టాలు హైలైట్ గా నిలవనున్నాయని, ఇప్పటికే చిత్రీకరించి హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనున్నాయని చెబుతున్నారు. ఫ్యామిలీ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని దసరాకు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.
ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి - మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `ఆచార్య` ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీని దేవాదాయ భూముల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్, ఆచార్య టీజర్, లిరికల్ వీడియోలు.. ఈ మూవీ కోసం అత్యంత కీలకంగా నిలిచే టెంపుల్ సిటీ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.