రాధేశ్యామ్‌ VS ఈటీ... అక్కడ అలా ఇక్కడ ఇలా!

Update: 2022-03-09 23:30 GMT
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల కాబోతున్న రాధేశ్యామ్‌ సినిమాకు అక్కడక్కడ పోటీ తప్పడం లేదు. ముఖ్యంగా తమిళనాట ఈ సినిమాకు కాస్త పోటీ ఎక్కువే ఉంది. అక్కడ ఈనెల 10 న అంటే రేపు సూర్య నటించిన ఈటీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా సక్సెస్ అయితే రాధేశ్యామ్‌ కు కష్టాలు తప్పవంటున్నారు.

సూర్య థియేట్రికల్‌ సక్సెస్ ను దక్కించుకుని ఏళ్లు అవుతుంది. అందుకే ఈ సినిమా తో సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో సూర్య ఉన్నాడు. విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి కమర్షియల్‌ సక్సెస్ లను దక్కించుకున్న దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో ఈటీ రూపొందింది. తమిళంతో పాటు తెలుగు లో భారీ గా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. రాధేశ్యామ్‌ కు ఒక్క రోజు ముందు ఈ సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈటీ పై ఉంది.

తమిళనాట ఈటీ సక్సెస్ టాక్ దక్కించుకుంటే ఖచ్చితంగా రాధేశ్యామ్‌ వసూళ్ల పై భారీగా ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న రాధేశ్యామ్‌ కంటే కూడా అక్కడ ఈటీ సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అక్కడ స్థానికత కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అనే టాక్‌ ఉంది. అందుకే ఈటీ టాక్ ను బట్టి తమిళనాట వసూళ్లు ఉంటాయి.

మరో వైపు ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈటీ ఫలితం ఎలా ఉన్నా కూడా రాధేశ్యామ్‌ ముందు ఆ సినిమా తేలిపోవడం ఖాయం. ఈటీ సినిమా సూపర్‌ డూపర్‌ టాక్‌ దక్కించుకున్నా కూడా రాధేశ్యామ్‌ తర్వాతే అన్నట్లుగా అంతా కూడా ఉంటారు. కనుక తమిళనాట ఈ రెండు సినిమాల పోటీ ఒకలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో పోటీ మరోలా ఉంటుంది. మొత్తానికి రెండు సినిమాలకు కూడా కాస్త నష్టం తప్పదు అనేది టాక్‌.

ప్రభాస్ రాధేశ్యామ్‌ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి ఏళ్లు దాటింది. అప్పటి నుండి ఉన్న అంచనాలకు తోడుగా ఆయన గత చిత్రాలు అయిన బాహుబలి మరియు సాహో సినిమాలు తమిళంలో భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఈటీ నెగటివ్ టాక్ ను దక్కించుకుంటే కచ్చితంగా మంచి వసూళ్లను నమోదు చేయడం ఖాయం అంటున్నారు.

ఈటీ కి ముందు సూర్య నుండి వచ్చిన ఆకాశమే నీ హద్దురా మరియు జై భీమ్‌ సినిమాలు సూపర్‌ హిట్ అయ్యాయి. కాని ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదల కాలేదు. ఓటీటీ స్ట్రీన్ పై సందడి చేశాయి. దాదాపు మూడు ఏళ్ల తర్వాత సూర్య థియేటర్‌ రిలీజ్ అవుతున్నాడు. ప్రభాస్ కూడా సాహో వచ్చిన ఇన్నాళ్లకు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కనుక రెండు సినిమాలు కూడా ఇద్దరు హీరోలకు వారి అభిమానులకు కీలకంగా మారింది.
Tags:    

Similar News