పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ పిరియాడిక్ హెరిటేజ్ డ్రామా 'రాధేశ్యామ్'. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఇటీవల విడుదలైంది. దాదాపు మూడున్న రేళ్లుగా ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెరదించులూ 'రాధేశ్యామ్' మార్చి 11న అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదలైంది. తొలి రోజు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ నిసాధించి సంచలనం సృష్టించింది.
అయితే సినిమా ఓపెనింగ్స్ ఎలా వున్నా టాక్ మాత్రం డివైడ్ గా వినిపించింది. భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి రావాల్సిన స్పందన మాత్రం ఎక్కడా రాకపోవడం గమనార్హం. సినిమా చూసిన చాలా మంది సినిమా ఆశించిన స్థాయిలో లేదని, చాలా స్లోగా వుందంటూ కామెంట్ లు చేశారు.
ఇప్పటికీ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీలో నటించిన నటీనటులపై కూడా కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం దాదాపు 300 కోట్లు ఖర్చు చేసిన మేకర్స్ దీనికి పాన్ ఇండియా లుక్ రావాలని ఇతర భాషల్లోని పాపులర్ నటీనటుల్ని ప్రత్యేకంగా ఈ మూవీ కోసం ఎంపిక చేశారు.
జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, జయరామ్, కునాల్ రాయ్ కపూర్, మురళీశర్మ, సత్యన్ వంటి వారిని ఎంపిక చేశారు. ఈ నటుల్లో ఎవరి పాత్రలకూ సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత వున్న పాత్రలు దక్కలేదు. ఇలా క్రేజీ నటులని ఎంపిక చేసుకున్నా వారిని ఉపయోగించుకోవాల్సిన విధంగా ఉపయోగించుకోలేదన్నది చాలా మంది వాదన. అంతే కాకుండా వారిని ఎంపిక చేసుకోవడం వల్ల సినిమాకు ఒరిగింది ఏమీ లేదని చెబుతున్నారు. కాస్ట్ పెరగడం తప్ప ఇతర పాత్రలు సినిమాకు పెద్దగా ఉపయోగపడలేకపోయారని చెబుతున్నారు.
ఒక్క సచిన్ ఖేడేకర్ పాత్ర తప్ప మిగతా వాళ్లు సినిమాకు ఏ విషయంలోనూ ప్లస్ కాలేకపోయారు. ఎంత ఇతర భాషలకు చెందిన క్రేజీ నటుల్ని సినిమాకు తీసుకున్నా వారికి ఆశించిన స్థాయి పాత్రలని ఇవ్వకపోవడం వల్ల ప్రాజెక్ట్ కి వారే మైనస్ గా మారతారని ఈ సినిమా మరోసారి నిరూపించిందని చెబుతున్నారు. ఎంత ఇతర భాషలకు చెందిన నటుల్ని తీసుకున్నా వారిని అనుకున్న స్థాయిలో ఉపయోగించుకుంటేనే సినిమాకు బలంగా నిలుస్తారు.
కానీ ఈ విషయంలో 'రాధేశ్యామ్' టీమ్ విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. భారీ కాప్టింగ్ ని సెట్ చేశారు కానీ వారిని అనుకున్న విధంగా ప్రజెంట్ చేయలేకపోయారు. దీంతో ఎంత పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సినిమాలో వున్నా వారికి సరైన ప్రాధాన్యత లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. 'రాధేశ్యామ్'ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ మళ్లీ ఇలాంటి తప్పులు చేయరని మరింతగా జాగ్రత్తలు తీసుకుంటారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారట.