వర్మకి పెళ్లి కాన్సెప్ట్ నచ్చదు .. అమ్మాయిల పిచ్చి లేదు!

Update: 2022-03-01 10:30 GMT
రామ్ గోపాల్ వర్మ తనకి స్నేహితులు ఎవరూ లేరని చెబుతూ ఉంటారు. అలాగే తనకి బంధుత్వాలు .. బంధాలపై నమ్మకం లేదని అంటారు. అలాంటి బంధాలకు తాను చాలా దూరంగా ఉంటానని ఆయన చాలా స్పష్టంగా చెప్పేస్తూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో వర్మ సోదరి విజయలక్ష్మి మాట్లాడుతూ ఒక వైపున వర్మ గురించి చెబుతూనే, తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా పంచుకున్నారు.

 ఆమె మాటల్లో వింటే .. "వర్మ తనకి ప్రేమ లేదు .. పిల్లలు ఇష్టం ఉండదు .. ఫ్యామిలీ ఇష్టం ఉండదు అంటూ ఉంటాడు. కానీ నాకు అందరూ ఉండాలి.

కానీ వర్మ మాదిరిగానే నాకు కూడా పెళ్లి కాన్సెప్ట్ ఇష్టం ఉండదు. మా వారు .. మా అత్తమామలు ఎంతో మాంచి వాళ్లు. అందరూ కూడా నన్ను ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు. ఇక మా కోడలు కూడా చాలా మంచిది .. వాళ్ల పేరెంట్స్ కూడా మంచివారే.

పెళ్లి చేసుకోవడం వలన నాకు వచ్చిన సమస్యలు గానీ .. కష్టాలుగానీ ఏమీ లేవు. కానీ నా అభిప్రాయంగా చెప్పాలంటే మాత్రం పెళ్లి అనేది నాకు ఇష్టం ఉండదనే చెబుతాను. మనుషులంటే ఇష్టం .. కానీ .. బంధాలను కోరుకోను. బంధాలను పెట్టుకుంటే పనులు కావని వర్మ చెబుతుంటాడు .. అతని ఆన్సర్ నాకు కరెక్టుగానే అనిపిస్తుంది.

తనకి అమ్మాయిల పిచ్చి అన్నట్టుగా వర్మ మాట్లాడతాడు. కానీ అందులో నిజం లేదు .. అది కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమే. అందుకు ఉదాహరణగా నేను ఒక ఇన్సిడెంట్ చెబుతాను. నా చిన్నప్పుడు మా ఇంటికి అనూరాధ అని నా ఫ్రెండ్ వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే 'అబ్బా .. నీ కళ్లు ఎంత బాగున్నాయో' అన్నాడు. అప్పట్లో అమ్మాయిలను అలా డైరెక్టుగా ఎవరూ కామెంట్ చేసేవారు కాదు. 'మీ అన్నయ్యకి నా కళ్లు నచ్చాయట' అంటూ ఆ అమ్మాయి మురిసిపోతూ ఉండేది. ఆ తరువాత అలా ఎలా అన్నావు .. ఆ అమ్మాయిది మెల్ల కన్నుగదా' అని అడిగాను. 'ఏదో ఎఫెక్ట్ కోసం అన్నానులే .. అసలు నేను చూశానేంటి" అన్నాడు.

నాకు బ్యాంకు పనులు తెలియదని వర్మ నాతో వచ్చేవాడు. క్యాష్ కౌంటర్ లో కొత్తగా ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని చూడగానే 'మీ స్మైల్ చాలా బాగుందండి' అన్నాడు. వాళ్లని సంతోషపెట్టడం కోసం అలా అనేవాడు. ఈ మధ్య అమ్మాయిలతో ఆయన వేసిన డాన్సు వీడియో చూసి మా ఇంట్లో వాళ్లే చాల బాధపడ్డారు. అదే విషయాన్ని నేను తనకి మెసేజ్ పెట్టాను. 'నేనేంటో తెలిసి మనింట్లో వాళ్లే అట్లా అనుకుంటే ఎట్లా? నేనేదో ఎఫెక్ట్ కోసం చేస్తుంటాను' అన్నాడు. ఇన్నేళ్ల కెరియర్లో వర్మ తనతో మిస్ బిహేవ్ చేశాడని ఏ అమ్మాయి ఎప్పుడూ కంప్లైంట్ చేసింది లేదు. దానిని బట్టే వర్మ ఎలాంటి వాడనేది అర్థం చేసుకోవచ్చు" అని చెప్పుకొచ్చారు.     


Tags:    

Similar News