ఫోటోటాక్‌ : మద్యలో ఈ అందాల ఆరబోత గొడవ ఏంట్రా బాబు

Update: 2022-03-17 02:30 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎలాంటి మ్యాటర్ లేని సినిమాలు చేసినా కూడా ఆ సినిమాల్లో నటించడం వల్ల గుర్తింపు వస్తుందని చాలా మంది హీరోయిన్స్ మరియు నటీనటులు భావిస్తూ ఉంటారు. అందుకే ఆయన దర్శకత్వంలో పారితోషికం లేకుండా నటించేందుకు కూడా సిద్ధం అని చాలా మంది హీరోయిన్స్ అంటూ ఉంటారు. తాజాగా ఈయన ఇద్దరు హీరోయిన్స్ గే డేంజరస్ అనే సినిమాను తెరకెక్కించాడు.

ఆ సినిమా లో ఇద్దరు అమ్మాయిలు లెస్బియన్ గా చూపించారు. ఇండియన్ సిల్వర్‌ స్క్రీన్‌ పై రాబోతున్న మొదటి లేడీ లెస్బియన్ మూవీ అంటూ వర్మ హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ఫోటోలు వీడియోలు సినిమా గురించి మీడియాలో చర్చించుకునే స్థాయిలో ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా గురించి హీరోయిన్స్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

ఈ సినిమా లో నైనా గంగూలీ మరియు అప్సర రాణి లు హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఒక లెస్బియన్‌ జంట కు మరియు భారీ మొత్తం లో డబ్బుకు సంబంధించిన కథ ఇది అని ఇటీవలే విడుదల అయిన ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు. ఇక యూనిట్ సభ్యులు ఈ సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అతి త్వరలోనే ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ వస్తుందని అంటున్నారు.

ఈ సమయంలోనే హీరోయిన్స్ నైనా గంగూలీ మరియు అప్సరా రాణి లు తమ హాట్ ఫోటో లను ఇన్‌ స్టా లో షేర్ చేస్తూ హీట్‌ పెంచుతున్నారు. తాజాగా నైనా గంగూలీ ఈ ఫోటోను షేర్‌ చేసి చెమటలు పట్టిస్తుంది. సినిమా ఖచ్చితంగా చెమటలు పట్టిస్తుంది అనడంలో సందేహం లేదు. కాని ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటో కూడా ఆసక్తిగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అప్సర రాణి థైస్‌  వరకు చూపిస్తూ ఈ ఫోటోలో స్టిల్‌ ఇచ్చింది. ఇక నైనా తన మొత్తం బాడీని ఆరబోసినట్లుగా ఫోజ్‌ ఇచ్చింది. అప్సర బాడీని ఆస్వాదిస్తున్నట్లుగా స్టిల్‌ లో నైనా ను చూపించినా.. జనాలు ఆస్వాదించేలా నైనా అందాల ఆరబోత ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో ఈ ఫోటో కు సంబంధించి ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News