రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా తో రవితేజ ఖచ్చితంగా హిట్ కొట్టేలా ఉన్నాడు అంటూ అభిమానులు చాలా నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన విడుదల హడావుడి మొదలయ్యింది.
ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అతి త్వరలోనే విడుదల తేదీ పై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో ఉన్నారు. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ ని సోనీ లివ్ ఓటీటీకి డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఇచ్చేశాం అంటూ యూనిట్ సభ్యులు ప్రకటించారు.
సోనీ లివ్ కు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఇవ్వడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాదిన మంచి ఆధరణ దక్కించుకున్న సోనీలివ్ కు తెలుగు లో ఎక్కువ శాతం మార్కెట్ లేదు. అయినా కూడా రామారావు ఆన్ డ్యూటీ ని ఆ ఓటీటీకి ఇవ్వడం పట్ల అభిమానులు ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్.. ఆహా.. హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉండగా కొత్త సోనీ వారికే ఎందుకు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
తెలుగులో సోనీ లివ్ కు తక్కువ మంది ఖాతాదారులు ఉన్నారు. రవితేజ సినిమా ను ఎంత మంది చూస్తారు అనేది అనుమానమే. సోనీ లివ్ మాత్రం ఈ సినిమాతో అయినా తమ ఖాతాదారులను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని మంచి చిన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సోనీ లివ్ వారు ఈ సినిమా తో జనాల్లోకి మరింతగా వెళ్లే అవకాశం ఉందని నమ్మకం పెట్టుకున్నారు.
ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఓటీటీ సెలక్షన్ విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయినా థియేటర్ రిలీజ్ తర్వాత ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అయితే ఏంటీ అన్నట్లుగా కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. రవితేజ ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కాస్త చూసుకోవాలి కదా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.