తెలుగులో ఒకప్పటి తరం అగ్ర కథానాయకులు మల్టీస్టారర్లు చేయడానికి ఏమాత్రం వెనకాడేవారు కాదు. కానీ ఆ తర్వాతి తరం నుంచి ఇప్పటి తరం వరకు మల్టీస్టారర్స్ చేయడానికి ఎన్నో లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. స్టార్డమ్ - ఫ్యానిజం వంటివి దృష్టిలో పెట్టుకుని మంచి కథలు దొరికినా మరో హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఆలోచిస్తుంటారు. ఒకవేళ కలిసి నటించినా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడానికి మేకర్స్ కు తలప్రాణం తోకకు వస్తుంది.
ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ పోటీపడే నందమూరి - మెగా ఫ్యామిలీ హీరోలతో ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి కలలో కూడా ఎవరూ ఊహించని.. అసాధ్యం అనుకున్న కాంబినేషన్ ను సుసాధ్యం చేశారు. మాస్ ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలకు సరిపడే కథ రాసుకొని ఒప్పించి.. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా షూటింగ్ ముగించి "ఆర్.ఆర్.ఆర్" చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేశారు.
మార్చి 25వ తేదీన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఇద్దరు బడా స్టార్లను హ్యాండిల్ చేసి అసలు పనిని సులువుగా ముగించిన రాజమౌళికి.. ఇప్పుడు వారి అభిమానులను హ్యాండిల్ చేయడం మాత్రం పెద్ద తలనొప్పిగా మారుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతోన్న కొద్దీ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్స్ చూస్తే ఇది ఇట్టే అర్థం అవుతుంది.
ఇప్పటివరకు 'ఆర్.ఆర్.ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లను బ్యాలన్స్ చేసుకుంటూ వస్తున్నారు జక్కన్న. అయినప్పటికీ వారి అభిమానులు మాత్రం సినిమా విషయంలో తమ హీరోనే ప్రధానం అంటూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకుంటూ వస్తున్నారు. మా హీరోనే గొప్ప అంటూ ఓ రేంజ్ లో ఫైట్ చేసుకుంటున్నారు.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 'తొక్కుకుంటూపోవాలే' అంటూ యూఎస్ లో గాలిలో విన్యాసాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనికి కౌంటర్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ఏదైనా తమ హీరో బరిలోకి దిగనంతవరకే అన్నట్లుగా 'వేటగాడువచ్చేంతవరకే' అనే యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ కు శ్రీకారం చుట్టారు.
#VetagaduVachenthavaRRRake అనే ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు యూఎస్ పిట్స్ బర్గ్ లో చరణ్ మీద అభిమానాన్ని చూపించడానికి ఫ్యాన్స్ కఠినమైన వాతావరణానికి ఎదురెళ్ళారు. -11°c చలి మరియు 30mph ఈదురు గాలుల మధ్య RRR రిలీజ్ నేపథ్యంలో రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలాఉంటే 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా చిత్ర యూనిట్ ఓ స్టిల్ ని రిలీజ్ చేసింది. ఇందులో రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరూ జెండా పట్టుకొని నిల్చొని ఉన్నారు. అయితే వీరి ఫ్యాన్స్ మాత్రం ఈ ఫొటోతో నెట్టింట రచ్చ చేయడం మొదలు పెట్టారు. మెగా ఫ్యాన్స్ తారక్ ను తీసేసి కేవలం చరణ్ ఉన్నట్టు ఎడిట్ చేస్తుంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దానికి రివర్స్ లో తమ హీరో మాత్రమే కనిపించేలా ఎడిట్స్ చేస్తున్నారు.
RRR సినిమాకు సంబంధించి ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. ప్రమోషనల్ కంటెంట్ వచ్చిన ప్రతిసారీ ఇలాంటిది చూస్తూనే ఉన్నాం. తమ హీరో మీద అభిమానం చూపించుకువడంలో తప్పులేదు. కాకపోతే తమ హీరో మాత్రమే గొప్ప అనే విధంగా చాటుకుంటుంటేనే అసలు సమస్య తలెత్తుతోంది. ఇప్పటికే ఇలా ఉంటే 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
కాగా, 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - ఆలియా భట్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ - శ్రియ - సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.