94వ ఆస్కార్ వేడుకల్లో హోస్ట్ చేసిన క్రిస్ రాక్ ని హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ వేదికపై చెంప చెళ్లు మనిపించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్ పై జోకులేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతతరం విల్ స్మిత్ వేదికపైనే క్షమాపణలు కూడా చెప్పారు.
ముందు లాగిపెట్టి కొట్టడం..ఆ తర్వాత సారీ చెప్పడం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. దీనిపై నెటి జనులు భిన్న రకాలుగా స్పందించారు. కొందరు క్రిస్ రాక్ ని సపోర్ట్ చేయగా మరి కొందరు విల్ స్మిత్ కి మద్దతుగా నిలిచారు. ఇప్పటికీ ఆ వీడియో నెట్టింట దుమారం రేపుతూనే ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఆస్కార్ చరిత్రలోనే మొట్ట మొదటిలసారి.
ఓ రకంగా ఆస్కార్ కి ఈ ఘటన ఓ కళంకితమనే చెప్పాలి. రాక్ అలా మాట్లాడటం...దీనికి బధులుగా విల్ స్మిత్ అందరి ముందు లాగి పెట్టి కొట్టడం రెండు తప్పేనని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించారు.
"విల్ స్మిత్ చెంపపై కొట్టి వదిలేసాడు. నేనైతై ఇంకా గట్టిగా తన్నేదాన్ని. ఫూల్స్ నవ్వించడానికి ఎవడైనా ఇండియట్ మా అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని ఉపయోగించుకుంటే..నేను విల్ స్మిత్ లాగే చేస్తాను. గట్టిగా బధులిస్తా. ఇలాంటి వాళ్లని వదిలి పెట్టకూడదు. ఆయన త్వరలోనే నా లాక్ అప్ షోకి వస్తాడని ఆశిస్తున్నా' అని ఇన్ స్టా రీల్స్ లో రాసుకొచ్చింది. దానికి లాఫింగ్ ఎమోజీని జత చేసింది.
కంగన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. కంగనకి మద్దతుగా నిలిచేవారు కొందరైతే కంగన వ్యతిరేక వర్గం ఆమెని టార్గెట్ చేసి కౌంటర్లు వేస్తున్నారు. పొర పాటున నోరు జారితే విల్ స్మిత్ లా లాగిపెట్టి కొట్టేయాలా? హోస్ట్ చేసిన తప్పును తప్పుగా చెప్పే ప్రయత్నం చేయాలి కదా? అలాంటి ప్రయత్నాలు లేకుండా కొట్టడం..దాన్ని నీలాంటి వాళ్లు సమర్ధించడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే వీటిని కంగన లైట్ తీసుకుంది. ఇలాంటి విమర్శలు కంగనకి కొత్తేం కాదు. ఏ విషయంపైనైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించే ధైర్యశాలి. వెనుకా ముందు ఆలోచించకుండా ఎంతటి శక్తివంతమైన వ్యక్తుల్ని అయినా ఢీ కొట్టగల దిట్ట కంగన. విమర్శలు..కౌంటర్లలు కంగనకి కొత్తేం కాదు. సినిమా రంగం నుంచి నిత్యం సవాళ్లును ఎదుర్కరుంటూనే కెరీర్ లో ముందుకు సాగుతుంది.