ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. రిలీజ్ కి ఇంకా పదిరోజులే సమయం ఉంది. దీంతో యూనిట్ మళ్లీ ప్రచారం పనుల్లో నిమగ్నమవుతోంది. దీనిలో భాగంగా పోస్టర్లని రిలీజ్ చేస్తోంది. అయితే ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు సహా తాజా సన్నివేశాన్ని బట్టి చూస్తుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోస్టర్లపైనే జక్కన్న ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టి పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. `ఆర్ ఆర్ ఆర్` లో తారక్ ఇమేజ్ నే బయటకు తీసుకుకొస్తున్న సన్నివేశం మీడియాలో హైలైట్ అవుతుంది.
నటులుగా రామ్ చరణ్- తారక్ ని ఇష్టపడినా వ్యక్తిగతంగా..ప్రోఫెషనల్ యాక్టర్ గా జక్కన్న ఎప్పుడూ మెచ్చేది కేవలం తారక్ ని మాత్రమే అన్నది అందరికీ తెలిసిన విషయం. ఆ రకంగా `ఆర్ ఆర్ ఆర్` లో తారక్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రని ఎక్కువగా ప్రత్యేక శ్రద్దతో హైలైట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తారక్ ఎదుగుదలని అందరికన్నా ఎక్కువగా కోరుకునే వ్యక్తి కూడా జక్కన్న. ఆ రకంగా తారక్ జపం జక్కన్న ఎప్పుడూ చేస్తుంటారు.
మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషిస్తున్న సీతారామారాజు పాత్ర విషయంలో ఎందుకంత అశ్రద్ద వహిస్తున్నట్లు? మరి దీని వెనుక జక్కన్న మాస్టర్ ప్లాన్ ఏదైనా ఉందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. `ఆర్ ఆర్ ఆర్` లో ఎక్కువగా రామ్ చరణ్ పోషిస్తున్న సీతారామరాజు పాత్రకు సంబంధించిన సన్నివేశాల ఎక్కువట. అవి ప్రత్యేకంగా సినిమాలో హైలైట్ అవుతాయని గుస గుస వినిపిస్తోంది. కొమరం భీమ్-సీతారామరాజు పాత్రల మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉందని....అలా ఏరకంగా చూసినా చరణ్ పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు.
అదే జరిగితే తారక్ అభిమానలు ఊరుకుంటారా? అందుకే ఇప్పుడా నెగిటివిటీని ముందొస్తుగానే తొలగించేందుకు జక్కన్న సినిమా రిలీజ్ కి ముందు తారక్ సోలో పోస్టర్లతో హైలైట్ చేస్తున్నట్లు గుసగుస వినిపిస్తోంది. సినిమా రిలీజ్ వరకూ ఇదే హడావుడి కొనసాగిస్తే రిలీజ్ తర్వాత సంగతి చూసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ప్రచార కార్యక్రమాల్లోనూ జక్కన్న తారక్ నే ఎక్కువగా హైలైట్ చేస్తున్నాడని అంటున్నారు.
ఇక్కడ మరో ప్రధానమైన కారణంగా కూడా తెరపైకి వస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే చరణ్-తారక్ అభిమానుల మధ్య చిన్న పాటి వైరం మొదలైంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప వ్యత్యాసం మళ్లీ తెరపైకి వస్తోంది. ఇరువురు హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకునే వరకూ పరిస్థితి వస్తోంది. వీటన్నింటిని బ్యాలెన్స్ చేయాలంటే జక్కన్న తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్లాలి.
వివాదం పతాకా స్థాయికి చేరకుండానే వాటిని ఆదిలోనే అంతం చేసేలా ఉండాలి. ఇద్దరు స్టార్ల మధ్య ఇలాంటి ఒత్తిడి సహజమే. ఈ విషయంపై ఇప్పటికే రాజమౌళి సినిమా తీయడం కన్న కష్టమైన పని ఫ్యాన్స్ ని బ్యాలెన్స్ చేయడం అంటూ వ్యాఖ్యానించారు.