దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఎన్నో సందేహాలు తెరపైకి వచ్చాయి. సరిగ్గా ఈ ఘటన `ఇండియాన్-2` మధ్యలో నిలిచిపోయిన అనంతరం చోటు చేసుకోవడంతో మీడియా కథనాలపై ఆసక్తి సైతం సంతరించుకుంది. సహజంగా కథనాలు సహజమే అయినా...శంకర్ ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరోల్ని అందర్నీ కాదని మరి తెలుగు హీరోవైపు చూడటంతో అప్పట్లో సంచలనంగానే మారింది.
`ఇండియన్ -2` షూటింగ్ మధ్య లో నిలిచిపోవడంతో శంకర్ ప్రతిష్ట దెబ్బతిందని.. శంకర్ ని నమ్మి ఏ నిర్మాత పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదని ప్రధానంగా తెరపైకి వచ్చింది. శంకర్ ప్రతిష్ట దెబ్బ తీసిన అంశంగా ప్రధానంగా హైలైట్ అయింది. శంకర్ ని నమ్మే పరిస్థితి లేదని కోలీవుడ్ మీడియాలో చిలవలు పలవలుగా కథనాలు వెలువడ్డాయి.
గత పరాజయాలు సహా ఆడంబరమే ఇందుకు కారణంగా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో చరణ్ తో సినిమా మొదలు పెట్టిన నాటి నుంచి దాదాపు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని..ఇప్పటికే కొంత మంది హీరోల్ని సైతం లాక్ చేసినట్లు ప్రచారంలో ఉంది.
ఇవన్నీ పక్కన బడితే శంకర్ మళ్లీ కోలీవుడ్ కి దగ్గరవుతున్నారా? అంటే అవుననే తాజా సన్నివేశాలు రుజువు చేస్తున్నాయి. సాధారణంగా శంకర్ తన సినిమా షూటింగ్ తప్ప ఇతర ఏ హీరో సినిమా విషయంలో గానీ...వాటి తాలుకా ఈవెంట్లకు హాజరవ్వడం గానీ చాలా రేర్ గానే జరుగుతుంటుంది.
బిజీ షెడ్యూల్ కారణంగా అలాంటి వాటిపై దృష్టి పెట్టరా? లేక ఆయన కావాలనే వెళ్లరా? అన్నది పక్కనబెడితే ఇటీవలి కాలంలో శంకర్ ఏ సినిమా వేడుకను విడిచిపెట్టని వైనాన్ని గమనించాల్సి ఉంది. ఆ మధ్యనే తమిళ వ్యాపార వేత్త శరవణన్ నటించిన `ది లెజెండ్` ప్రీ రిలీజ్ వెడుక అతిధుల్లో శంకర్ ఒకరు. అలాగే రెండు రోజుల క్రితమే కార్తీ హీరోగా నటించిన ఓ సినిమా వేడుకకు శంకర్ అతిధిగా విచ్చేసారు.
ఆ వేదిక సాక్షిగా సూర్య చేసిన కొన్ని వ్యాఖ్యలు కోలీవుడ్ లో కలకలం రేపాయి. శంకర్ ప్రతిభని సొంత భాష గుర్తించడం లేదు అన్న మీనింగ్ సూర్య మాటల్లో కనిపించింది. గొప్ప దర్శకుడ్ని వదిలేసుకుంటున్నాం అని అక్కడి ఇండస్ర్టీని హెచ్చరించే ప్రయత్నం గా హైలైట్ అయింది.
శంకర్ టాలీవుడ్ కి వెళ్లి సినిమా చేస్తున్నారంటే? మనమెంత దారుణమైన స్థితిలో ఉన్నామో! ఆలోచించిల్సాన అవసరం ఉంది అన్న తీరు కనిపించింది. అలాగే శంకర్ కొందరి కోలీవుడ్ స్టార్ హీరోల సినిమా సెట్స్ ని సైతం సందర్శించినట్లు తెలుస్తోంది. మరి ఈ సంకేతాలన్ని శంకర్ ని మళ్లీ కోలీవుడ్ కి దగ్గర చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి. ఆగిపోయిన `ఇండియాన్ -2` సె ప్టెంబర్ నుంచి మళ్లీ మొదలవుతున్న సంగతి తెలిసిందే.