హృతిక్ X సుసానే! అత‌డు ఆమెతో ఆమె అత‌డితో!

Update: 2022-04-06 04:21 GMT
బాలీవుడ్ లో విచ్ఛిన్న దాంప‌త్యం.. అటుపై కొత్త పార్ట్ న‌ర్ తో షికార్లు వ‌గైరా నిరంత‌రం హెడ్ లైన్స్ లోకి వ‌స్తూనే ఉన్నాయి. తార‌లు బ్రేక‌ప్ లు సంచ‌ల‌నంగా మారుతుంటే అభిమానులు చాలా బాధప‌డుతూనే ఉన్నారు. ముచ్చ‌టైన జంట‌లు విడిపోతుంటే త‌ట్టుకోలేని ప‌రిస్థితి ఉంది. కానీ పైవాడి రాత‌ను మార్చేదెలా?

ముచ్చ‌టైన ల‌వ్ క‌పుల్ గా పేరున్న హృతిక్ రోష‌న్ త‌న భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు పిల్ల‌లు ఉన్నా విడివిడిగానే ఉన్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో కొత్త భాగ‌స్వామితో లింక‌ప్ చేస్తూ హృతిక్ పైనా.. సుసానే పైనా వ‌రుస క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. కానీ ఆ ఇద్ద‌రూ అధికారికంగా ఏదీ ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా హృతిక్ తన సంబంధాన్ని అధికారికం చేస్తూ.. ప్రియురాలి చేతిలో చెయ్యేసి న‌డుస్తూ క‌నిపించాడు. కొన్ని వారాల క్రితం ముంబైలోని ఒక రెస్టారెంట్ లో హృతిక్ రోషన్ మిస్టరీ గర్ల్ తో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దాని గురించి చాలా ప్ర‌చార‌మైంది. తరువాత ఆ చిత్రాలలో ఉన్న అమ్మాయి సబా ఆజాద్ అని.. అప్ క‌మింగ్ నటి అని వార్తలు వచ్చాయి. హృతిక్ ఆమెతో ఏడాదికి పైగా రిలేషన్ షిప్ లో ఉన్నాడు.. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కానీ ఈరోజు హృతిక్ సబా ఆజాద్ చేతిలో చెయ్యేసి  విమానాశ్రయం నుండి బయటకు వస్తున్నట్లు కనిపించడంతో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించిన‌ట్ట‌య్యింది. ఫోటోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ కాలేదు. హృతిక్ తల్లిదండ్రులు కూడా అతని కొత్త సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని స‌మాచారం. త్వరలో హృతిక్ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అలాగే సుస్సేన్ ఖాన్ - అర్స్లాన్ గోని కొన్ని గంటల క్రితం ముంబై విమానాశ్రయంలో కలిసి కనిపించారు. ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు చేతిలో చెయ్యేసి న‌డుస్తూ క‌నిపించడం సంచ‌ల‌న‌మైంది. నటుడు అర్స్లాన్ గోనీతో సుస్సానే డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు ఇంత‌లోనే చెలరేగాయి. అయితే వారు ఈ పుకార్లను ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు, అక్కడ వారు ఒకరి పోస్ట్ లపై మరొకరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అంతేకాదు.. వారి ఫోటోలు.. పార్టీ ప్రదర్శనలు... పర్యటనలు కలిసి మంటలకు ఆజ్యం పోస్తున్నాయి. దీని గురించి మాట్లాడుతూ.. కొంతకాలం క్రితం.. ఈ జంట నగరంలో ల్యాండ్ అయినప్పుడు విమానాశ్రయంలో ప‌డి ప‌డి న‌వ్వేసారు. సుస్సానే మాజీ భర్త హృతిక్ రోషన్ - అతని స్నేహితురాలు సబా ఆజాద్ ఈ రోజు కూడా విమానాశ్రయంలో క‌నిపించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

సుస్సాన్ - అర్స్లాన్ రాత్రి వారి విమానాశ్రయంలో ఎంతో సౌక‌ర్య‌మైన‌ దుస్తులతో క‌నిపించారు. ఒక జత బైకర్ షార్ట్ తో నెక్ టీ-షర్టును ధరించి అత‌డు క‌నిపించ‌గా.. సుస్సేన్ పూర్తిగా నలుపు రంగు దుస్తులను ధరించి కనిపించింది. ఆమె మెడకు లేత రంగు శాలువా కూడా చుట్టింది. ఇంటీరియర్ డిజైనర్ గా సుసానే ముంబై స‌ర్కిల్స్ లో పాపుల‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే.

గత నెలలో సుస్సాన్-అర్స్లాన్ టర్కీలో ఉన్నారు. అక్కడ'మాజీ లవ్ ఏక్ తర్ఫా' అనే ప్రాజెక్ట్ కోసం షూటింగ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ గురించిన వివరాలు గోప్యంగా ఉంచారు. వారిద్దరూ తమ ట్రిప్ లోని పలు చిత్రాలను తమ తమ సోషల్ మీడియా స్పేస్ లలో పంచుకోగా వైర‌ల్ అయ్యాయి. ఈ జంట సాన్నిహిత్యంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.
Tags:    

Similar News