పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల `రాధేశ్యామ్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్గా నటించగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ వింటేజ్ ప్రేమ కథా చిత్రం మార్చి 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందులోకపోయిన రాధేశ్యామ్.. బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.
అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు థియేటర్స్‌లో సక్సెస్ అవ్వకపోయినా ఓటీటీ వేదికగా హిట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా మూవీని విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి దింపేశారు. ప్రముఖ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచి రాధేశ్యామ్ అందుబాటులోకి వచ్చేసింది.
అయితే ఇప్పుడు ప్రభాస్ రూట్‌నే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఎంచుకున్నాడు. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత సూర్య `ఈటి (ఎవరికీ తలవంచడు)`తో అందరి ముందుకు వచ్చాడు.
పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నించేలా ఈ సినిమాను రూపొందించారు.
తెలుగు, తమిళ్ భాషల్లో మార్చి 10న విడుదల చేయగా.. ఈ సినిమా సైతం ప్రేక్షకులను నిరాశ పరిచింది. కథ బాగున్నా ఆకర్షించే కథనం లేకపోవడం, సరిగ్గా ప్రమోషన్స్ నిర్వహించకపోవడం, ఆ తర్వాత రోజు రాధేశ్యామ్ థియేటర్స్‌లోకి దిగడం వంటి అంశాలు సినిమా కలెక్షన్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. మొత్తానికి వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న సూర్య.. ఈటి రూపంలో బిగ్ ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
ఇకపోతే ఈ సినిమాను కూడా విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. ఏప్రిల్ 7న ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ లలో స్ట్రీమింగ్ చేసేందుకు తేదీ ఖరారు చేశారు. మరి సూర్య ఈటికి ఓటీటీ అయినా కలిసొస్తుందో.. లేదో.. చూడాలి.