చ‌ర‌ణ్ ని గెలిపించి జ‌క్క‌న్న ఓడిపోయాడా?

Update: 2022-04-08 10:28 GMT
యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూసిన చిత్రం 'ట్రిపుల్ ఆర్‌'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన చిత్ర‌మిది. డీవీవీ ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా స్టార్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు మూడున్న‌రేళ్లుగా ఎదురుచూసిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 25న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తోంది. చ‌రిత్ర‌లో నిలిచిపోయిన ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఫోరోషియ‌స్ లెజెండ్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల ఫిక్ష‌న‌ల్ క‌థ‌గా ఈ  చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించారు.

1920 లో ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని స‌రికొత్త మేకింగ్‌, టేకింగ్ తో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రూపొందించారు. యుఎస్ ప్రీమియ‌ర్స్ నుంచే సంచ‌ల‌నాలకు శ్రీ‌కారం చుట్టిన ఈ మూవీ ఇప్ప‌టి వ‌రకు ప్ర‌పంచ వ్యాప్తంగా 967 కోట్లు రాబ‌ట్టి త్వ‌ర‌లో 1000 కోట్ల క్ల‌బ్ లో చేర‌బోతోంద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్ప‌టికే 'బాహుబ‌లి ది బిగినింగ్‌', 2.O, పీకె చిత్రాల ఆల్ టైమ్ వ‌సూళ్ల‌ని అధిగ‌మించిన ఈ చిత్రం బ‌జ‌రంగీ భాయ్ జాన్ వ‌సూళ్ల‌పై క‌న్నేసింది. ఈ మూవీ 969 కోట్ల‌ని సాధించి అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన టాప్ 10 చిత్రాల్లో 3వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

త్వ‌ర‌లోనే ఈ మూవీని 'ట్రిపుల్ ఆర్' రికార్డు స్థాయి వ‌సూళ్ల‌తో అధిగ‌మించ‌బోతోంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సీక్వెల్ అంటూ స‌రికొత్త చ‌ర్చ మొద‌లైంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం సీక్వెల్ కి ఆస్కారం వుంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆఱ్ అడిగితే త‌న ఆలోచ‌న‌లు పంచుకున్నాన‌ని, అవి రాజ‌మౌళి, ఎన్టీఆర్ కు బాగా న‌చ్చాయ‌ని, దైవానుగ్ర‌హం వుంటే సీక్వెల్ వ‌స్తుంద‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఆ సంద‌ర్భంగా వెల్ల‌డించ‌డం తాజా వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరింది.

సీక్వెల్ వార్త‌లు ఇలా వుంటే ఈ చిత్రంపై జ‌రుగుతున్న ప్ర‌చారం మ‌రో విధంగా వుంది. స్టోరీ, నీరు, నిప్పు అనే కాన్సెప్ట్ తో 'ట్రిపుల్ ఆర్‌' చిత్రాన్ని తెర‌కెక్కించిన రాజ‌మౌళి ఇందులో న‌టించిన ఇద్ద‌రు హీరోల్లో అల్లూరి సీతారామ రాజు గా న‌టించిన చ‌ర‌ణ్ పాత్ర‌ని బాగా ఎలివేట్ చేయ‌డ‌మే కాకుండా ప్ర‌ధానంగా హైలైట్ చేశాడంటూ కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇది యాదృచ్చికంగా జ‌రిగిందా?  రాజ‌మౌళి కావాల‌ని చేశాడా అన్న‌ది ప‌క్క‌న పెడితే జ‌క్క‌న్న ఓ అద్భుత‌మైన సినిమాని తెర‌పై ఆవిష్క‌రించాల‌ని చేసిన ప్ర‌య‌త్న‌మే కానీ ఎక్క‌డా ఒక‌రిని త‌క్కువ చేసి మ‌రొక‌రిని ఎక్కువ చేసి చూపించాల‌నుకోలేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

అయితే ఇటీవ‌ల ముంబై మీడియాకు సంబంధించిన కొంత మంది చ‌ర‌ణ్, ఎన్టీఆర్ పాల్గోన్న ఓ మీడియా మీట్ లో మీ పాత్ర‌నే ప్ర‌ధానంగా హైలైట్ చేసి చూపించ‌డం మీకు ఎలా అనిపించింద‌ని చ‌ర‌ణ్ ని ప్ర‌శ్నంచారు. తెలుగులో దీనిపై ఇన్ సైడ్ చ‌ర్చ జ‌రుగుతున్నా ఎవ‌రూ రాజ‌మౌళిని కానీ, హీరోలు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌ని కానీ డైరెక్ట్ గా అడ‌గ‌లేదు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం ఆ ప్ర‌శ్న‌ని సంధించింది. అయితే దీనికి చ‌ర‌ణ్ డిప్ల‌మాటిక్ గానే స‌మాధానం చెప్పారు. ఎక్క‌డా సినిమాలో ఇద్ద‌రిలో ఒక‌రిని త‌గ్గించి ఒక‌రిని హైలైట్ చేసే ప‌ని జ‌ర‌గ‌లేద‌ని, ఇద్ద‌రికీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స‌మ‌ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని చెప్పుకొచ్చారు.

కానీ సినిమా చూస్తే మాత్రం ఎన్టీఆర్ ని త‌గ్గించి రామ్ చ‌ర‌ణ్ ని హైలైట్ చేసిన‌ట్టుగానే వుంది. ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుండ‌టంతో చాలా మంది ప్రేక్ష‌కులు, ఎన్టీఆర్ అభిమానులు మ‌రీ ప్ర‌త్యేకంగా చ‌ర‌ణ్ ని గెలిపించ‌డం కోసం రాజ‌మౌళి ఓడిపోయార‌ని, చ‌ర‌ణ్ ని హైలైట్ చేసే క్ర‌మంలో ద‌ర్శ‌కుడిగా జ‌క్క‌న్న ప‌ట్టుని కోల్పోయాడ‌ని కామెంట్ లు చేస్తున్నారు. ఇటీవ‌ల బాలీవుడ్ మీడియా ప్ర‌శ్నించిన తీరు హైలైట్ కావ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నార‌ట‌.
Tags:    

Similar News