రన్ రాజా రన్ చిత్రంతో చిన్న వయసులోనే మంచి కమర్షియల్ సక్సెస్ దక్కించుకున్న దర్శకుడు సుజీత్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈయన ప్రభాస్ తో సాహో సినిమాను తీయడం కోసం మూడు సంవత్సరాల పాటు వెయిట్ చేశాడు. సాహో ను మరో మూడు సంవత్సరాలు చేశాడు. మొత్తంగా ఒక్క ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఆరు సంవత్సరాల సమయం తీసుకున్నాడు అంటూ సుజీత్ గురించి టాక్ ఉంది.
ప్రభాస్ తో సాహో వంటి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తీసిన సుజీత్ కు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంది అంటూ చాలా మంది భావించారు. కాని సాహో సినిమా ఇక్కడ నిరాశ పర్చింది. బాలీవుడ్ లో సాహో పర్వాలేదు అనిపించినా కూడా ఈయనకు ఆఫర్లు పెద్దగా దక్కలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా లూసీఫర్ రీమేక్ చేసే బాధ్యత వచ్చింది. స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి మార్చమని సుజీత్ కు టాస్క్ ఇచ్చారట.
ఆ సమయంలో సుజీత్ ఇచ్చిన స్క్రిప్ట్ నచ్చక పోవడంతో రీమేక్ ప్రాజెక్ట్ నుండి తప్పించారనే వార్తలు వచ్చాయి. ఆ విషయంలో నిజా నిజాలు ఏంటీ అనేది ఇప్పటి వరకు తెలియదు. మెగాస్టార్ తో లూసీఫర్ వంటి సూపర్ హిట్ మూవీ రీమేక్ చేసే మెగా అవకాశం చేతుల్లోకి వచ్చి పోయినట్లు అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఏడాది గ్యాప్ వచ్చింది.
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తో ఈయన సినిమా చేసే అవకాశం దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ మరియు సుజీత్ ల మద్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒక మీడియం రేంజ్ బడ్జెట్ మూవీగా వీరి కాంబోలో మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారట.
రన్ రాజా రన్ వంటి ఒక ఔట్ అండ్ ఔట్ కామెడీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను సుజీత్ తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
ఎఫ్ 3 హడావుడి తర్వాత వరుణ్ తేజ్ పూర్తిగా ఖాళీగా ఉన్నాడు. ఆ సమయంలో విన్న ఈ స్టోరీకి వరుణ్ ఓకే చెప్పడం.. ప్రస్తుతం సుజీత్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు రెడీ అవ్వడం జరుగుతుందని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.