స్టార్ హీరోల, డైరెక్టర్ల, నిర్మాతల వారసులు ఇండస్ట్రీలో హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది వారసులు హీరోలుగా క్రేజ్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ లు గా స్థిరపడ్డారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా మంది ప్రస్తుతం బిజీగా వున్నారు కూడా. ఇప్పుడు వీరి తరహాలోనే మరో స్టార్ ప్రొడ్యూసర్ వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
వివరాల్లోకి వెళితే... ట్రిపుల్ ఆర్ వంటి సంచలన చిత్రాన్ని అందిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య తన వారసుడిని హీరోగా పరిచయం చేయబోతున్నారు.
గత కొంత కాలంగా తన తనయుడు కల్యాణ్ ని హీరోగా పరిచయం చేయాలని దానయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందు కోసం చాలా మంది దర్శకులని పరిశీలించిన దానయ్య ఫైనల్ గా ఆ బాధ్యతల్ని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించారని తెలిసింది. సరికొత్త కథతో తెరపైకి రాబోతున్న ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని తెలిసింది.
కాగా ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ 'అధీర' అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్టుగా చిత్ర వర్గాల సమాచారం. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్' లో ప్రధాన విలన్ పాత్ర పేరు అధీర.
అదే పేరుని దానయ్య తనయుడి ఆరంభ చిత్రానికి టైటిల్ గా ప్రశాంత్ వర్మ ఫైనల్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే రానుందని, ఇటీవలే ఈ చిత్ర పూర్తి కథని నిర్మాత దానయ్యకు ప్రశాంత్ వర్మ వినిపించారని, కథ నచ్చడంతో దానయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'హను మాన్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ రియల్ సూపర్ హీరో కథగా ఓ అడ్వెంచరస్ స్టోరీతో సోషియో ఫాంటసీ మూవీని తెరకెక్కిస్తున్నారు. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో అంజమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన తరువాతే దానయ్య తనయుడితో 'అధీర' చిత్రాన్ని ప్రశాంత్ వర్మ ప్రారంభిస్తారట.