హైదరాబాద్ మాదాపూర్ తీగల బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. శరీరంలో లోపల ఎలాంటి రక్తస్రావం లేదని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సాయిధరమ్ గుండె, ఊపిరితిత్తులు, మెదడుకు ఎలాంటి గాయాలు లేవన్నారు. కంటిపైన, ఛాతిపైన చర్మం బలంగా రోడ్డుకు గీసుకుపోవడంతో అక్కడ గాయాలయ్యాయని చెప్పారు. భుజం రోడ్డుకు గట్టిగా తాకడంతో కాలర్ బోన్ విరిగిందన్నారు. శస్త్రచికిత్స చేసి సరిచేస్తామని వైద్యులు తెలిపారు.
సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యే వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని అపోలో ఆస్పత్రి తెలిపింది. చికిత్సకు పూర్తిగా స్పందిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సృహలోకి వచ్చినట్లు సమాచారం.
బైక్ ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. చికిత్సకు పూర్తి స్థాయిలో స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
సాయిధరమ్ తేజ్ కు స్కానింగ్ సహా అన్ని పరీక్షలను వైద్యులు పూర్తి చేశారు. శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం కాలేదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ‘కాలర్ బోన్’ ఫ్యాక్చర్ కావడంతో ఈరోజు దానికి శస్త్రచికిత్స నిర్వహించడంపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు. వైద్య పరీక్షల ఫలితాలను పరిశీలించి నిర్ణయించుకున్నారు.