పవర్ స్టార్‌పవన్ కల్యాణ్ సినిమా ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో విడుదలైనా థియేటర్లలో సృష్టించే సునామీ అంతా ఇంతా కాదు. బరిలో ఎవరు అడ్డుగా వున్నా పవన్ పవర్ ఫుల్ తూఫాన్ ముందు కొట్టుకుపోవాల్సిందే. అదీ పవన్ క్రేజ్. అలాంటి హీరో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సినిమా చేస్తే... అందులో మాస్ ని పిచ్చెక్కించే పాత్రలో పవన్ విశ్వరూపాన్ని చూపిస్తే.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే.. సరిగ్గా ఇదే జరగబోతోంది. `గబ్బర్‌సింగ్` తరువాత అంతకు మించి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటించిన చిత్రం` భీమ్లా నాయక్`.
రానా కీలక పాత్రలో నట్టించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలో తుఫాన్ సృష్టిస్తుందా? అని గత కొన్ని రోజులుగా పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ రోజు రానే వచ్చింది. పవన్ ఊర మాసీవ్ పాత్రలో నటించిన `భీమ్లా నాయక్` ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. వారం ముందే హల్ చల్ మొదలుపెట్టిన ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ తో పాటు ప్రీమియర్ షోల పరంగా సంచలనాలు సృష్టించడం మొదలుపెట్టింది.
పవన్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కి త్రివిక్రమ్ కూడా తోడవ్వడంతో సినిమా ఓ రేంజ్ లో వుంటుందనే క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్కు ప్రాసలు.. పంచులు కాకుండా మాసీవ్ డైలాగ్ లు రాయడం.. అవి ట్రైలర్ లో ఓ రేంజ్ లో పేలడంతో సినిమాలో పవన్ చెప్పే డైలాగ్ లపై కూడా అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. ఇదిలా వుంటే తొలి రోజు `భీమ్లా నాయక్` తూఫాన్ బాక్సాఫీస్ వద్ద ఎలా వుండబోతోంది? .. తొలి రోజు బాక్సాఫీస్ లెక్కలేంటీ? .. ఎంత వసూలు చేయబోతోంది? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే `భీమ్లా నాయక్` పై బ్లాక్ బస్టర్ రిపోర్ట్ లు రావడంతో పవన్ కల్యాణ్ దెబ్బకు బద్దలయ్యే రికార్డులు.. భీమ్లా వసూలు చేయబోతున్న తొలి రోజు కలెక్షన్ లపై చర్చ మొదలైంది. సినిమాపై నెలకొన్న క్రేజ్ కారణంగా తొలి రోజు భీమ్లా రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టే అవకాశం వుందని తెలుస్తోంది. తెలంగాణలో బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చారు. అయితే ఏపీలో ఇప్పటికీ పాత పద్దతే కొనసాగుతోంది. టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ మనసు మార్చుకోకపోవడంతో అక్కడ భీమ్లా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం వుందంటున్నారు.
`భీమ్లా నాయక్` ప్రీ రిలీజ్ బిజినెస్ 108 కోట్లుగా చెబుతున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ లోకి రావాలంటే 109 నుంచి 110 కోట్ల వరకు రాబట్టాలి. ఇప్పటికే యూఎస్ ప్రీమిమర్ షోల ద్వారా 700k డాలర్లని రాబట్టింది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు వసూళ్లపైనే అందరి దృష్టి వుంది. ఈ నేపథ్యంలో క్రేజ్ ని బట్టి భీమ్లా తొలి రోజు 30 కోట్ల వరకు కొల్లగొట్టే అవకాశం వుందని చెబుతున్నారు. మార్చి 11న `రాధేశ్యామ్` రానున్న నేపథ్యంలో మధ్యలో రెండు వారాలే వుండటంతో ఈ మూవీ సాధించబోయే ప్రారంభ వసూళ్లు ఇప్పుడు కీలకంగా మారాయి. పవన్ చరిష్మా ఏ స్థాయిలో సునామీ సృష్టిస్తుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.