ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ `బుక్ మై షో`- డిస్ర్టిబ్యూటర్లు..నిర్మాతల మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. బుక్ మై షో దోపిడి ఆపాలంటూ డిస్ర్టిబ్యూటర్లు అంతా శమరశంఖం పూరించారు. దీనిలో భాగంగా `బుక్ మై షో`ని బ్యాన్ చేయాలని నైజాం పంపిణీదారులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
టిక్కెట్ నుంచి అధనంగా 11 శాతం డిస్ర్టిబ్యూటర్లకి రావాల్సింది బుక్ మై షో తీసుకుంటుందని పంపిణీదారులు ఆరోపిస్తుండగా... ఒక్ క్యాబ్ కూడా లేని ఊబర్ లాంటి సంస్థలు క్యాబ్ వవ్యవస్థనే నియంత్రిస్తు న్నాయని అలాంటప్పుడు సినిమాపై తమకెందుకు హక్కు లేదన్న చందంగా బుక్ మై షో వ్యవహరిస్తోంది. ఇప్పుడీ వివాదాన్ని చక్కదిద్దడానికి నిర్మాత ..పంపిణీ దారుడు దిల్ రాజు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఆయన బుక్ మై షో యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సయాచారం. తాజాగా ఈ వ్యవహరంపై మరో నిర్మాత..పంపిణీదారుడు సునీల్ నారంగ్ బుక్ మై షోని దుయ్యబెట్టారు. ```బుక్ మై షో` అనే దాన్ని మేమే తీసుకొచ్చాం. ఇప్పుడు మమ్మల్ని దెయ్యంలా పట్టుకుని పీడిస్తోంది. ఇప్పుడు తీసేయండ్రా? బాబు అంటోన్న మాట వినడం లేదు. చిన్న సినిమాలకు..పెద్ద సినిమాలకు ఒకే రకమైన దోపిడీకి `బుక్ మైషో` పాల్పడుతుంది. అలాగైతే ప్రేక్షకులు థియేటర్ కి రారు. కాలక్రమేణా థియేటర్లో సినిమా చూసే పరిస్థితే ఉండదు.
పెద్ద సినిమాలకు పెంచుకోమని..చిన్న సినిమాలకు తగ్గించు తీసుకోమని అడుగుతున్నా ఒప్పుకోవడం లేదు. మేమే బుక్ మై షోని తీసుకొచ్చాం. ఇప్పుడు మేమే తీసేమని అడుగుతున్నాం. ప్రేక్షకులు పాత రోజుల్లా మళ్లీ థియేటర్ బుకింగ్ వద్దకు వచ్చి టిక్కెట్ కొనుగోలు చేసి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. ఒక్కసారిగా బుక్ మైషో ని తీసేయడం ఈజీ కాదు. అంతా ఆన్ లైన్ పోర్టల్ కి అలవాటు పడ్డారు కాబట్టి. నెమ్మదిగా బుక్ మై షోని నిలిపివేసి దాని స్థానంలో ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలో బుకింగ్ పోర్టల్ ని నిర్వహించాలని`` సునీల్ నారంగ్ కోరారు.
మొత్తానికి డిస్ర్టిబ్యూటర్ల పరిస్థితి ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లు అయింది. ఈనెల 24 నుంచి అగ్ర హీరోల సినిమాలన్ని రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు బుక్ మై షోకి బాగా అలవాటి పడి ఉన్నారు. థియేటర్ వద్ద టిక్కెట్లు విక్రయించినా థియేటర్ కి వెళ్లి జనాల్లో గుమ్మిగూడి టిక్కెట్ కొనేంత ఆసక్తి చూపించడం లేదు.
ఈ పరిస్థితి చాలా కాలంగా ఉంది. ఆన్ లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకుని షో టైమ్ కి సీటు లు కూర్చునేంత వెసులుబాటు దొరికింది. మళ్లీ ఇప్పుడు థియేటర్ కి వెళ్లి టిక్కెట్ కొనడం అంటే అంత సమయాన్ని వెచ్చించ గల్గుతారా? అన్నది సందేహమే. వీలైనం త్వరగా ఈ సమస్య కు పరిష్కారం దొరకకపోతే సినిమాలు కిల్ అవుతాయన్నది సుస్పష్టం.
Full View