లండ‌న్ మాసీవ్ స్క్రీన్ పై టాలీవుడ్ వండ‌ర్‌

Update: 2022-03-02 11:30 GMT
మార్చిలో భారీ పాన్ ఇండియా చిత్రాల హ‌ల్ చ‌ల్ మొద‌లు కాబ‌తోంది. మ‌రి కొన్ని రోజుల్లో వీటి హంగామా ప‌తాక స్థాయికి చేర‌బోతోంది. మార్చి 11న `రాధేశ్యామ్‌` రిలీజ్ అవుతుండగా ఈ మూవీ రిలీజైన రెండు వారాల త‌రువాత టాలీవుడ్ వండ‌ర్ హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ కాబోతోంది. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ మార్చి 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా హ్యూజ్ స్కేల్ లో రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ హంగామా ప్ర‌మోష‌న్స్ తో త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబఃధించిన ఓ స‌ర్ ప్రైజింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

చాలా కాలంగా ఈ మూవీ రిలీజ్ కోసం అభిమానుల‌తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో దేశీయ బాక్సాఫీస్ తో పాటు ఓవ‌ర్సీస్ మార్కెట్ లోనూ ఈ మూవీ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబ‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన ఈ చిత్రం తాజాగా అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకోనుంద‌ని తెలిసింది. భ‌ర‌తీయ చిత్రాలేవి ఇంత వ‌ర‌కు ప్ర‌ద‌ర్శింప‌బ‌డ‌ని మాసీవ్ స్క్రీన్ పై `ఆర్ ఆర్ ఆర్‌` ని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు.

లండ‌న్ లోని బిగ్గెస్ట్ (ది బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్) బీఎఫ్ ఐ ఐమాక్య్ స్క్రీన్ పై`ఆర్ ఆర్ ఆర్‌` ప్రిమియ‌ర్ షో ని నిర్వ‌హించ‌బోతున్నార‌ట‌. ఇది బ్రిట‌న్ లో వున్న ఏకైక బిగ్సెస్ట్ స్క్రీరింగ్ థియేట‌ర్.  ఇలా ఇండియా నుంచి లండ‌న్ లోని బిగ్గెస్ట్ ఐమాక్య్ స్క్రీన్ పై ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్న తొలి సినిమాగా `ఆర్ ఆర్ ఆర్‌` రికార్డుని నెకొల్ప‌బోతుండ‌టం విశేషం.

`ఆర్ ఆర్ ఆర్‌` 25న విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే అయితే ప్రీమియ‌ర్ షో మాత్రం 24న నిర్వ‌హించ‌బోతున్నారు. బీఎఫ్ ఐ ఐమాక్య్ స్క్రీన్ ఐదు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్ ల ప‌రిమాణం అంత బిగ్ గా స్క్రీన్ వుంటుంద‌ని, ఈ స్క్రీన్ పై సినిమా చూస్తే క‌లిగే ఎక్స్‌పీరియ‌న్స్ ని మాట‌ల్లో చెప్ప‌లేమ‌ని చెబుతున్నారు.

ప్రేక్ష‌కుల్ని స‌రికొత్త అనుభూతికి లోను చేసే ఈ బిగ్ స్క్రీన్ పై ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాట్ , లార్డ్ ఆఫ్ ద రింగ్స్ , ద అమేజింగ్ స్పైడ‌ర్ మేన్ వంటి చిత్రాలు మాత్ర‌మే స్క్రీనింగ్ అయ్యాయ‌ని, అలాంటి తెర‌పై మ‌న భార‌తీయ సినిమా `ఆర్ ఆర్ ఆర్‌` ప్ర‌ద‌ర్శింప‌డానికి రెడీ కావ‌డం విశేష‌మని, ఈ సంఘ‌ట‌న‌తో టాలీవుడ్ సినిమా ప్ర‌పంచ స్థాయిలో పోటీప‌డుతోంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.  

ఇదిలా వుంటే యూకేలో ఈ మూవీని 1000 స్క్రీన్ ల‌లో రిలీజ్ చేయాల‌ని డిస్ట్రిబ్యూట‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామారాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్‌, గోండు బెబ్బులి కొమ‌రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించారు. కీల‌క పాత్ర‌ల్లో హాలీవుడ్ న‌టులు రే స్టీవెన్ స‌న్‌, అలీస‌న్ డూడీ, ఒలివియా మోరిస్, బాలీవుడ్ న‌టులు అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించారు.
Tags:    

Similar News