RRR సెల‌బ్రేష‌న్స్ కి టెక్నిక‌ల్ బ్రేక్‌

Update: 2022-03-14 12:30 GMT
`బాహుబ‌లి` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా వున్న అభిమానులు దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గ‌త కొంత కాలంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చి 25న విడ‌బుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

దీంతో ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్స్ పీక్స్ కి చేరింది. ఇప్ప‌టికే రిలీజ్ కు ముందే యుఎస్ ప్రీమియ‌ర్స్ బుకింగ్స్ తో చ‌రిత్ర సృస్టించిన `ఆర్ ఆర్ ఆర్‌` పై చ‌ర్చ జ‌రుగుతోంది. రిలీజ్ కు ముందే `ఆర్ ఆర్ ఆర్` ఫీవ‌ర్ ఈ రేంజ్ లో వుంటే రేపు రిలీజ్ త‌రువాత ఏ స్థాయికి చేరుతుందోన‌ని అంతా ఆరాతీస్తున్నారు.

సినిమా రిలీజ్ క‌న్ఫ‌ర్మ్ కావ‌డంతో ఓవ‌ర్సీస్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేయ‌డం మొద‌లు పెట్టారు. కెన‌డాకు చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ `ఆర్ ఆర్ ఆర్‌` కోసం వినూత్న పంథాలో ప్ర‌చారం చేస్తుండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా వుంటే సినిమా రిలీజ్ కి టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో `ఆర్ ఆర్ ఆర్‌` మేకర్స్ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించ‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ చిత్ర ప్ర‌చారాన్ని మేక‌ర్స్ ఈ నెల 14 సోమ‌వారం నుంచి ప్రారంభించాల‌ని ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగా ఆర్ ఆర్ ఆర్ సెల‌బ్రేష‌న్స్ అంథెమ్ `ఎత్త‌ర జెండా .. సాంగ్ కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఐదు భాష‌ల్లో ఏక కాలంలో ఈ లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే టెక్నిక‌ల్ స‌మ‌స్య కార‌ణంగా ఈ లిరిక‌ల్ వీడియోని మంగ‌ళ‌వారానికి పోస్ట్ పోన్ చేసిన‌ట్టుగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని ఐదు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. `ఆర్ ఆర్ ఆర్‌` భారీ అంచ‌నాల మ‌ధ్య మార్చి 25న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ క‌థ‌గా ఈ చిత్రాన్నిద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించారు. యావ‌త్ దేశం మొత్తం ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్‌, గోండు బెబ్బులి కొమ‌రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించారు. మిగ‌తా కీల‌క పాత్ర‌ల్లో అలియా భ‌ట్‌, ఒలివియా మోరీస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలీస‌న్ డూడీ, స‌ముద్ర‌ఖ‌ని క‌నిపించ‌బోతున్నారు. 1920లో జ‌రిగిన స్వాతంత్య్ర స‌మ‌రం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఫిక్ష‌న‌ల్ క‌థ‌ని జోడించి తెర‌కెక్కించారు. మార్చి 25న విడుద‌ల కానున్నఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.
Tags:    

Similar News