ఫోటోటాక్ : కళ్లు పెద్దవి చేసి చూడాలనిపించేంత అందం

Update: 2022-03-05 17:30 GMT
హైదరాబాద్‌ లో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ అధితి రావు హైదరి. 2006 సంవత్సరంలో మలయాళం సినిమా తో తెరంగేట్రం చేసి స్కిన్ షో కంటే కంటెంట్‌ ఓరియంటెడ్‌ పాత్రలకు ప్రాముఖ్యత ఇస్తూ వచ్చిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా కెరీర్ ను బిల్డ్‌ చేసుకుంటూ వచ్చింది. అందంతో పాటు అభినయంలో కూడా ఆహా అనిపించేలా ఉండే ఈమె తెలుగు లో ఈమద్య కాలంలో వరుస సినిమాల్లో నటిస్తూ ఉంది.

ఆమద్య స్కిన్ షో కు నో చెప్పిన ఈమె మెల్ల మెల్లగా అందాల ఆరబోతకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా చెబుతూ వచ్చింది. పాత్ర డిమాండ్‌ చేస్తే అందాలను ఆరబోసేందుకు రొమాంటిక్ సన్నివేశాలకు ఓకే అంటాం అని చాలా మంది హీరోయిన్స్ అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఈమె వెళ్లే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. తెలుగు లో ఈమె నటించిన సినిమాలు పెద్దగా కమర్షియల్‌ విజయాలను దక్కించుకోలేక పోయాయి.

అయినా కూడా టాలీవుడ్‌ ప్రేక్షకులు ఈమెను అభిమానిస్తూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈమె ఫోటో లు వైరల్‌ అయ్యాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండే ఈమె తాజాగా తన థైస్‌ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ ఇచ్చిన ఫోటో ఫోజుకు అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడి కొత్త అవతారం అన్నట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

తెలుగు లో సమ్మోహనం సినిమా తో మంచి పేరును దక్కించుకున్న ఈమె నటిగా టాలీవుడ్‌ లో బిజీ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి కాని ప్రతి ఒక్క ఆఫర్‌ కు ఈమె ఓకే చెప్పడం లేదు. ఆచి తూచి ఈమె సినిమా ఆఫర్లను కమిట్‌ అవుతుంది. ముందు ముందు కూడా ఈమె మెల్లగానే సినిమాలు చేసే ఉద్దేశ్యంతో ఉంది.

మహాసముద్రంలో ఈమె పాత్ర కథలో చాలా కీలకం. అందుకే ఆ సినిమాలో నటించింది. కాని దురదృష్టం ఆ సినిమా నిరాశ పర్చింది. ఆకట్టుకోలేక పోయిన ఆ సినిమా లో నటించినా కూడా ఈమెకు మరిన్ని తెలుగు ఆఫర్లు వస్తున్నాయి.

కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా వరుసగా సౌత్‌ లో అన్ని భాషల్లో కూడా ఆఫర్లుదక్కించుకుంటున్న ఈమె బాలీవుడ్‌ వైపు కూడా చూస్తుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిని తనవైపుకు మరల్చుకునే ప్రయత్నం ఈ అమ్మడు చేస్తోంది.
Tags:    

Similar News