గడిచిన రెండేళ్లుగా కరోనా క్రైసిస్ సినీపరిశ్రమల్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ని సమస్యల సుడిగుండంలోకి నెట్టింది. అంతకుముందే హిందీ పరిశ్రమ సరైన విజయాల్లేక అల్లాడుతోంది. కరోనా ప్రవేశంతో సన్నివేశం మరీ దిగజారింది. అయితే అదే సమయంలో టాలీవుడ్ మాత్రం దూకుడు ప్రదర్శించింది. కోరానాను సైతం లెక్క చేయక తెలుగు ఆడియెన్ తెలుగు సినిమాని ఆదరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఇటీవల వరుసగా 1000 కోట్ల క్లబ్ సినిమాలతో బాలీవుడ్ పై దక్షిణాది సవారీ సంచలనంగా మారుతోంది.
అక్కడ 100 కోట్ల క్లబ్ కూడా కష్టమే అనుకుంటున్న సమయంలో టాలీవుడ్ నుంచి ఆర్.ఆర్.ఆర్ .. శాండల్వుడ్ నుంచి కేజీఎఫ్ 2 ఒకదాని వెంట ఒకటిగా వచ్చి బంపర్ హిట్లు కొట్టాయి. ఇవి రెండూ 1000 కోట్ల క్లబ్ చిత్రాలుగా రికార్డులకెక్కాయి. అయితే బాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలైనా ఇంత పెద్ద ఫీట్ ని అందుకోవడం కష్టమన్న చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ ని ఆదుకునే నాధుడే లేడా? అంటూ చర్చ మొదలైంది. ఇప్పటికి `భూల్ భూలయ్యా 2`తో కార్తీక్ ఆర్యన్ ఆదుకున్నాడని చెప్పాలి. `భూల్ భూలయ్యా 2` బాక్స్ ఆఫీస్ వద్ద చక్కని విజయం అందుకుంది. 9 రోజులకు ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును దాటింది. తొమ్మిదో రోజుకు రూ. 108.97 కోట్లు సంపాదించింది.
కార్తిక్ ఆర్యన్- కియారా అద్వానీ జంటగా టబు ప్రధాన పాత్రలో నటించిన హారర్-కామెడీ భూల్ భూలయ్యా 2 బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్ ను కొనసాగిస్తోందని ట్రేడ్ చెబుతోంది. ఇప్పుడు రూ. 100 కోట్ల క్లబ్ తో హోప్ ని పెంచింది. 2007 కల్ట్ కామెడీ భూల్ భూలయ్యా కు కొనసాగింపు కథతో వచ్చిన సినిమా గా ఆ వ్యామోహం తాజా విజయానికి కారణమని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
ఈ చిత్రం రెండవ శనివారం రూ. 10.40 కోట్లు సంపాదించి మొత్తం కలెక్షన్లను రూ. 108.97 కోట్లకు చేర్చింది. వివేక్ అగ్నిహోత్రి ది కాశ్మీర్ ఫైల్స్- సంజయ్ లీలా బన్సాలీ గంగూబాయి కతియావాడి తర్వాత 2022లో 100కోట్ల క్లబ్ లో మూడవ హిందీ చిత్రంగా నిలిచింది. సిసలైన హీరో సెంట్రిక్ ఫిలింగా కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కి ఈ మూవీ విజయం అందుకుంది.
కామెడీ- దర్శకత్వం-నట ప్రదర్శనలు- కథాంశం ప్రతిదీ ఈ సినిమా విజయానికి కారణమయ్యాయి. ముఖ్యంగా జిగ్ జాగ్ హుక్ స్టెప్ పై ప్రవహించే కార్తీక్ టైటిల్ ట్రాక్ ప్రేక్షకులకు నచ్చింది. ఇటీవల భూల్ భులయా వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీనిలో ఇద్దరు అమ్మాయిలు హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ అనే పల్లవికి డ్యాన్స్ చేయడం కనిపించింది. అంతటి క్రేజ్ ను యూత్ లో నెలకొల్పింది.
2018 కామెడీ చిత్రం సోనూ కే టిటు కి స్వీటీ తర్వాత బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టిన కార్తీక్ రెండవ చిత్రంగా భూల్ భులయా నిలిచింది. అనీస్ బాజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 152 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. భూల్ భూలయ్యా 2 కార్తీక్ అతిపెద్ద బాక్సాఫీస్ విజయంగా నమోదైంది.
తరణ్ ఆదర్శ్ శుక్రవారం వరకు బాక్సాఫీస్ గణాంకాలను ట్వీట్ చేశాడు . #భూల్‌భూలయ్యా2 అద్భుతంగా ముందుకు సాగుతోందని.. కొత్త ప్రత్యర్థులచే ప్రభావితం కాకుండా... వారాంతంలో పెద్ద సంఖ్యలను ఆశించవచ్చని.. రూ. 100 కోట్ల క్లబ్ ని తాకుతుందని ఆయన అన్నారు. మునుముందు అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ సహా పలు భారీ చిత్రాలు విడుదలకు వస్తున్నాయి. వాటి విజయాల గురించి బాలీవుడ్ హోప్ తో ఉంది.