ఔట్‌ డేటెడ్‌ హీరోయిన్ ఆ జోనర్‌ కి పరిమితం అవ్వాల్సిందేనా

Update: 2022-03-02 23:30 GMT
చైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్ ను ఆరంభించిన హన్సిక తెలుగు లో అల్లు అర్జున్‌ కు జోడీగా దేశ ముదురు సినిమాను చేసి 2007 సంవత్సరంలో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. పలువురు స్టార్ హీరోలతో చేసినా కూడా ఈమెకు స్టార్‌ హీరోయిన్ హోదా దక్కలేదు. సెకండ్‌ గ్రేడ్ హీరోయిన్ గానే ఈ అమ్మడు కొనసాగుతూ వచ్చింది. తెలుగు లో కెరీర్‌ ఆరంభంలో ఎక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు తమిళ సినిమాలకు పరిమితం అయ్యింది.

టాలీవుడ్‌ నుండి సరైన ఆఫర్లు రాకపోవడం వల్లే అక్కడ సినిమాలు చేయడం లేదు అంటూ గతంలో ఒక చిట్‌ చాట్‌ లో హన్సిక వెళ్లడించింది. తమిళనాట కూడా ఈమెకు గొప్ప సినిమా ఆఫర్లు ఏమీ రావడం లేదు. కమర్షియల్‌ హీరోయిన్ గా స్టార్‌ హీరోకు జోడీగా ఈమె నటించి చాలా కాలం అయ్యింది. ఎక్కువగా ఈమెకు లేడీ ఓరియంటెడ్ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఒకటి రెండు లేడీ ఓరియంటెడ్‌ సక్సెస్ అవ్వడంతో వరుసగా అవే చేస్తోంది.

కమర్షియల్‌ హీరోయిన్‌ గా హన్సిక ను చూపించాలని.. చూడాలని ఫిల్మ్‌ మేకర్స్ పెద్దగా భావించడం లేదేమో.. అందుకే ఆమెను హీరోలకు జోడీగా పరిశీలించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా హన్సిక నుండి మరో సినిమా ప్రకటన వచ్చింది.

ఈసారి కూడా ఈమె ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ని చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. హీరోయిన్ గా ఈమెకు థ్రిల్లర్ కామెడీ జోనర్‌ కలిసి వచ్చింది. దాంతో ఈసారి కూడా ఆ జోనర్ మూవీనే చేయబోతుంది.

తమిళ దర్శకుడు ఆర్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో హన్సిక హీరోయిన్ గా ఒక సినిమా ను చేయబోతున్నారు. శివ రాత్రి సందర్బంగా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయడం జరిగింది. సినిమా ను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేసి ఆగస్టు లో విడుదల చేస్తామంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

హన్సిక సినిమాల సంఖ్య పెంచుకోవడం కాకుండా కాస్త మంచి సినిమాలు.. హీరోలకు జోడీగా కమర్షియల్‌ పాత్రలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే తమిళ మీడియా జనాలు మాత్రం హన్సిక రెగ్యులర్ సినిమాలకు హీరోయిన్‌ గా చేసే అవకాశాలు దక్కక పోవచ్చు. ఆమె ఇక మీదట వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు మరియు థ్రిల్లర్ కామెడీ జోనర్‌ సినిమాలు మాత్రమే చేసుకోవాల్సిందే అంటూ టాక్ వినిపిస్తుంది.
Tags:    

Similar News