తెలుగు సినిమాను గురించి ప్రస్తావిస్తే ఎన్టీఆర్ - సావిత్రి కంటే ముందు నుంచే హీరోలు .. హీరోయిన్లు ఉన్నారు. తొలినాళ్లలోనే వాళ్లు తమదైన ప్రభావం చూపించారు. కానీ తెలుగు సినిమాకి సంబంధించిన ఒక విప్లవాత్మకమైన మార్పు అనేది హీరోల్లో ఎన్టీఆర్ .. హీరోయిన్లలో సావిత్రి నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. అందువలన వాళ్ల నుంచి చెప్పుకోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అప్పట్లో సావిత్రి .. జమున .. కృష్ణ కుమారి అందమైన అభినయంతో అశేష ప్రేక్షకులను కట్టిపడేశారు. కొన్నేళ్ల పాటు ఈ ముగ్గురు నాయికలు వెండితెరపై వెలిగిపోయారు.
ఆ తరువాత తరంలో శారద .. వాణిశ్రీ .. కాంచన తమ ప్రభావం చూపించారు. శారద .. వాణీశ్రీ నటన ప్రధానమైన పాత్రలను ఎక్కువగా చేస్తూ వెళితే, కాంచన మాత్రం కాస్త గ్లామర్ టచ్ ఉన్న పాత్రలను పోషిస్తూ వెళ్లారు. ఎవరి ప్రత్యేకతను వాళ్లు చాటుతూ తమకంటూ ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. అదే సమయంలో జయసుధ .. జయప్రద .. శ్రీదేవి కథానాయికలుగా తమ జోరును చూపించడం మొదలుపెట్టారు. నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలను జయసుధ చేసుకుంటూ వెళితే, గ్లామర్ తో కూడిన నటనకు కేరాఫ్ అడ్రెస్ గా జయప్రద .. శ్రీదేవి మారిపోయారు.
ఈ ముగ్గురు హీరోయిన్ల హవా తగ్గుతూ ఉండగానే విజయశాంతి .. రాధ .. భానుప్రియ ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్ పరంగా .. నటన పరంగా .. డాన్సుల పరంగా ముగ్గురూ ముగ్గురే అనిపించారు. ముఖ్యంగా చిరంజీవి సరసన ఎవరు మెరిసినా హిట్ పెయిర్ అన్నట్టుగానే ఉండేవారు.
ఆ తరువాత తెరపై సౌందర్య .. రోజా .. రంభ సందడి మొదలైంది. నటన ప్రధానమైన పాత్రలపై సౌందర్య .. గ్లామరస్ పాత్రలపై రంభ దృష్టి పెడితే, ఈ రెండు రకాల పడవలపై రోజా ప్రయాణం చేసింది. వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో వాళ్లు విహారం చేస్తుండగానే, శ్రియ .. కాజల్ .. తమన్నా తెరపైకి దిగిపోయారు.
గ్లామర్ పరంగా .. నటన పరంగా కూడా వంకబెట్టలేని టాలెంట్ తమ సొంతమని నిరూపొంచుకున్నారు. చాలా కాలం పాటు కెరియర్ ను కొనసాగించిన హీరోయిన్లలలో ఈ బ్యాచ్ చివరిదని అనుకోవచ్చునేమో. ఎందుకంటే ఇక ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, అంత కాలం పాటు తెరపై నిలబడే ట్రెండ్ కాదిది.
ప్రస్తుతానికైతే పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్ తమ హవాను కొనసాగిస్తున్నారు. తరువాత బ్యాచ్ లో ముగ్గురు హీరోయిన్ల అనావాయతీకి భిన్నంగా కృతి శెట్టి - శ్రీలీల ఇద్దరు ముద్దుగుమ్మలు మాత్రమే కనిపిస్తున్నారు. మరో హీరోయిన్ ఈ ఇద్దరికి ముందు వచ్చి చేరుతుందా? తరువాత వచ్చి వాలుతుందా? అనేది చూడాలి.