నివేదా థామస్ గ్యాప్ తీసుకుందా? లేక వ‌చ్చిందా?

Update: 2022-07-21 23:30 GMT
నివేదా థామస్.. ఈ డింపుల్ సుంద‌రి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరళలో పుట్టిన ఈ అందాల భామ.. మ‌ల‌యాళ చిత్రంతో బాలనటిగా తన కెరీర్‌ని స్టార్ట్ చేసి, ఆ త‌ర్వాత హీరోయిన్ గా మారింది. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `జెంటిల్ మేన్` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే త‌న అందం, అభిన‌యం, అంత‌కు మించిన టాలెంట్ తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన నివేదా థామ‌న్‌.. ఆపై తెలుగులో వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంది.

ఈ క్ర‌మంలోనే నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా వంటి హిట్ చిత్రాల‌ను ఖాతాలో వేసుకుంది. మ‌రోవైపు త‌మిళ, మ‌లయాళ భాష‌ల్లోనూ న‌టించిన నివేదా.. గ‌త కొంత కాలం నుండి చాలా సైలెంట్ గా ఉంటోంది. సోష‌ల్ మీడియాలో త‌ప్పా సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. ఈమె నుండి చివ‌రిగా వ‌చ్చిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కోర్ట్ డ్రామా మూవీ ఇది.

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన `పింక్‌` సినిమాకు రీమేక్ గా వ‌కీల్ సాబ్ ను రూపొందించారు. ఇందులో నివేదా థామ‌స్ తో పాటు అంజ‌లి, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2021లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా నిలిచింది. అలాగే ఇందులో వేముల పల్లవిగా న‌టించిన నివేదా థామ‌స్ కు విమర్శకుల ప్రశంసలు ద‌క్కాయి.

అయితే వ‌కీల్ సాబ్‌ త‌ర్వాత నివేదా నుండి మ‌రో సినిమా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అస‌లు సినిమాల నుండి నివేదా థామ‌స్ కావాల‌నే గ్యాప్ తీసుకుందా..?లేక అవ‌కాశాలు రాక‌పోవ‌డం వ‌ల్ల గ్యాప్ వ‌చ్చిందా..? అన్న దానిపై మాత్రం స్ప‌ష్ట‌త లేదు. ఇక ప్ర‌స్తుతం ఈమె చేతిలో `శాకిని డాకిని` అనే ఒకే ఒక్క చిత్రం ఉంది.

టాలీవుడ్ డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో నివేదా థామ‌స్‌, రెజీనా కాసాండ్రా ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. కొరియ‌న్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితం అవుతోంది. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగ‌నుంది.

అయితే ఈ మూవీ నుండి మేక‌ర్స్ ఎప్పుడో గ‌త ఏడాది ఒక పోస్ట‌ర్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఆ త‌ర్వాత `శాకిని డాకిని`కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అస‌లు ఈ సినిమా ఉందో..లేదో.. కూడా అర్థం కావ‌డం లేదు. గ‌తంలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుద‌ల చేయనున్నామ‌ని నిర్మాత‌లో ఒక‌రైన సురేశ్ బాబు వెల్ల‌డించారు. కానీ, అందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు.
Tags:    

Similar News