ఆర్ ఆర్ ఆర్ సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న ఎన్టీఆర్ తదుపరి సినిమా ను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ 30 కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా సెట్స్ పై ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ 30 సినిమా ను కొరటాల శివ అధికారికంగా ప్రకటించాడు.. కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.
కొరటాల శివ ఆచార్య సినిమా నిరాశ పర్చడంతో ఎన్టీఆర్ 30 విషయంలో మునుపటి కంటే కూడా ఇంకాస్త జాగ్రత్తను పాటిస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ వెళ్లే విషయంలో ఆలస్యం చేస్తూ వస్తున్నారు.
మొన్నటి వరకు సినిమాను జూన్ లో ప్రారంభించబోతున్నట్లుగా కొరటాల శివ టీమ్ వర్గాల వారు చెబుతూ వచ్చారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్ లో సినిమా పట్టాలెక్కబోవడం లేదట.
ఎన్టీఆర్ 30 విషయంలో దర్శకుడు కొరటాల శివ మరియు ఎన్టీఆర్ లు ఫుల్ క్లారిటీగా.. పాన్ ఇండియా రేంజ్ సినిమా గా చేయాలని భావిస్తున్నారు. అందుకోసమే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం కావాల్సినంత సమయం తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మరో రెండు నెలలు అదనంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం తీసుకుంటారట. దాంతో సినిమా ఆగస్టు లో ప్రారంభం అవ్వబోతుందని తెలుస్తోంది.
షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయినా మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేసేలా పక్కా ప్లాన్ తో స్క్రిప్ట్ వర్క్ ను చేయబోతున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. తమిళ మ్యూజిక్ సెన్షేషన్ అనిరుథ్ రవిచంద్రన్ ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమా కోసం ట్యూన్స్ ను రెడీ చేస్తున్నాడు.
కొరటాల శివ ప్రస్తుతం స్క్రిప్ట్ వ్యవహారంలో బిజీగా ఉన్నాడు. మరో వైపు ఎన్టీఆర్ కూడా పాత్రకు తగ్గట్లుగా మంచి ఫిజిక్ కోసం వర్కౌట్స్ చేస్తున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ 30 కాస్త ఆలస్యం అయినా కూడా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రం ఆగడం లేదు.. ఆలస్యం అవ్వడం లేదు. తప్పకుండా భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ 30 వస్తుందనే నమ్మకం ఉంది.