శ్రీవల్లిని మరో రేంజ్ కి తీసుకు వెళ్లనున్న లెజెండ్‌

Update: 2022-02-25 05:55 GMT
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకుంది. సినిమా అంతటి విజయాన్ని సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది సంగీతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవి శ్రీ ప్రసాద్‌ అందించిన పుష్ప సంగీతం కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా యావత్‌ దేశం మొత్తం సినీ అభిమానులను అలరించింది.

జాతీయ స్థాయిలో యూట్యూబ్‌ లో ఇంకా కూడా పుష్ప పాటలు ట్రెండ్‌ అవుతున్నాయి అంటే ఏ స్థాయిలో జనాలు పుష్ప పాటలను ఆధరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక డబ్బింగ్‌ సినిమా పాటలు యూట్యూబ్‌ లో ఎప్పుడు దక్కించుకోని స్థాయిలో మిలియన్ ల కొద్ది వ్యూస్ ను దక్కించుకోవడం ఇదే ప్రథమం. శ్రీవల్లి సాంగ్‌ ఏ స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుందో అందరికి తెల్సిందే. శ్రీవల్లి హిందీ మరియు ఇతర వర్షన్‌ లు కూడా యూట్యూబ్‌ ను షేక్‌ చేశాయి.

అల్లు అర్జున్‌ ఆ పాటలో వేసిన స్టెప్పులతో పాటు దేవి శ్రీ అందించిన సంగీతం ఆ పాట స్థాయిని పెంచేసింది. అందుకే శ్రీవల్లి ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఈ శ్రీవల్లి పాటను మరో స్థాయికి తీసుకు వెళ్లేందుకు లెజెండ్‌ సింగర్ ఉషా ఉతుప్‌ సిద్దం అయ్యారు. ఆమె మన శ్రీవల్లి పాటను బెంగాళి వర్షన్‌ లో రెడీ చేశారు. బెంగాళి వర్షన్‌ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ప్రోమోలోనే ఉషా గారు అదరగొట్టేశారు.

శ్రీవల్లి బెంగాళి వర్షన్‌ ఫుల్‌ వీడియోను ఈనెల 28వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. బంగాల్‌ లో ఈ పాటను ఉషా ఉతుప్‌ గారు పాడటం వల్ల దేవిశ్రీ సంగీతం మరింత మందికి రీచ్ అవ్వబోతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవల్లి పాట కేవలం ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా సందడి చేసింది. వార్నర్‌ తో పాటు ఇంకా పలువురు స్టార్స్ కూడా శ్రీవల్లి పాట స్థాయిని పెంచారు.

ఇప్పుడు ఉషా ఉతుప్‌ వంటి గొప్ప సింగర్‌ శ్రీవల్లి పాటను బెంగాళి వర్షన్ లో పాడేందుకు ముందుకు రావడం వల్ల పాట స్థాయి అమాంతం పెరిగినట్లే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పాటలు ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా పుష్ప పార్ట్‌ 1 ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప పార్ట్‌ 2 అంతటి విజయాన్ని సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా అదే స్థాయి సంగీతాన్ని దర్శకుడు సుకుమార్‌ మళ్లీ ఇవ్వాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.


Full View
Tags:    

Similar News