మార్చి 11న విడుదలైంది రాధేశ్యామ్. బాహుబలి స్టార్ ప్రభాస్ నటించిన అరుదైన ప్రేమకథా చిత్రంగా ప్రమోటైంది. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా యువి క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్- టీసిరీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా రాణించలేకపోయింది. అయితే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆరంభ వసూళ్లు అద్భుతంగా వచ్చాయని యువి సంస్థ ప్రకటించింది.
ప్రేమ అంటే ఏమిటో నమ్మని వాడిగా ఫేట్ ని నమ్మేవాడిగా ఇందులో ప్రభాస్ కనిపించారు.
అయితే అతడు అనూహ్యంగా ప్రేరణ (పూజా హెగ్డే)తో ప్రేమలో పడ్డాక అసలు కథ నడుస్తుంది. యూరప్ లొకేషన్ లలో సుందరమైన దృశ్యకావ్యంలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించినా ఎమోషనల్ కనెక్టివిటీ మిస్సవ్వడంతో సినిమా ఫ్లాపైంది.
అయితే ఇంతలోనే రాధేశ్యామ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 20రోజుల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగుకి వచ్చేసింది.
ఐఎండిబిలో 6.9 రేటింగ్ ఉంది.. ఓటీటీలో వీక్షించేవారి సంఖ్య అనూహ్యంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. విక్రమాదిత్య- ప్రేరణ జంట ప్రేమకథ ఎలా సాగిందో థియేటర్లలో వీక్షించలేకపోయిన వారికి ఓటీటీ వీక్షణతో సాధ్యమేనన్నమాట.