'బాహుబలి' విజువల్ వండర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
RRR చిత్రం మార్చి 25న తెలుగు తమిళ మలయాళ కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే అన్ని ప్రధాన సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ ఖాయమనే విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో RRR చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతి లభించింది.
దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ట్రిపుల్ ఆర్ మేకర్స్ రెడీ అయ్యారు. అయినప్పటికీ అధిక ధరలు చూసి ప్రేక్షకులు నిరుత్సాహానికి గురవడం లేదని అసాధారణమైన బుకింగ్స్ చూస్తే అర్థం అవుతుంది.
ట్రెండ్ చూస్తుంటే ఏపీ, తెలంగాణల్లో 'ఆర్.ఆర్.ఆర్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాయనడంలో సందేహం లేదు. ఇక ఓవర్ సీస్ లోనూ రాజమౌళి సినిమా అదరగొట్టబోతోందని తెలుస్తోంది.
యూఎస్ఏలో ఈ చిత్రం 1150 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ అవుతుండగా.. ప్రీమియర్ షో ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే 2 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్ళు వచ్చాయి. విడుదల తేదీ నాటికి మరిన్ని కలెక్షన్స్ ఖాయంగా కనిపిస్తోంది.
అయితే ఓవర్సీస్ లో RRR తెలుగు మరియు 3డీ వెర్షన్ కు మాత్రమే కనీవినీ ఎరుగని విధంగా బుకింగ్స్ వస్తున్నాయి. కానీ అక్కడ మిగతా వెర్షన్స్ కు బుకింగ్స్ అంతగా లేకపోవడం గమనార్హం.
ఇక చెన్నైలో కూడా 'ఆర్.ఆర్.ఆర్' బుకింగ్స్ డల్ గానే ఉన్నాయి. తమిళ్ కంటే తెలుగు వెర్షన్ కు ఎక్కువ టికెట్లు తెగుతున్నట్లు తెలుస్తోంది. ముంబైలో పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. వాటితో పోల్చుకుంటే బెంగుళూరులో బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. కొచ్చిలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదని తెలుస్తోంది.
'బాహుబలి' దర్శకుడు రాజమౌళితో కలిసి ఎన్టీఆర్ - రామ్ చరణ్ దేశవ్యాప్తంగా ముమ్మరంగా RRR చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్లు ప్రస్తుతానికి టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ సహాయపడలేదని తెలుస్తోంది. రిలీజ్ కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కాబట్టి.. బుకింగ్స్ పుంజుకునే అవకాశం ఉంది.
అలానే ప్రీమియర్ షోలతో హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద RRR సినిమా కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ రాబడుతుంది. దగ్గర్లో మరో పెద్ద సినిమా రిలీజ్ కూడా లేదు కాబట్టి రికార్డు స్థాయి కలెక్షన్స్ గ్యారెంటీ. మరి ఏం జరుగుతుందో చూడాలి.
కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - సముద్ర ఖని - శ్రీయా శరన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.