ప్ర‌జ‌ల్ని క‌ష్టాల్లో ఆదుకునే టాప్ 10 టాలీవుడ్ గాడ్స్

Update: 2022-03-06 08:30 GMT
సెల‌బ్రిటీలైన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్నో సేవ‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాల్లో మేమున్నామ‌ని భ‌రోసానిస్తున్నారు. విరివిగా ఆర్థిక విరాళాలు అందిస్తున్నారు. సేవ‌లో నేరుగా పాలు పంచుకుంటున్నారు. అలాంటి టాప్ 10 టాలీవుడ్ గాడ్స్ ఎవ‌రున్నారు? అన్న‌ది ఆరా తీస్తే ప‌లు ఆస‌క్తికర సంగుతులు ఇలా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి- బ్ల‌డ్ బ్యాంక్ - ఐ బ్యాక్ సేవ‌ల గురించి ప్ర‌త్యేకించి గుర్తు చేయాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్ధాల పాటు చిరు ఈ సేవ‌ల్ని నిరంత‌రాయంగా చేస్తున్నారు. చిరంజీవితో పాటు రామ్ చ‌ర‌ణ్ - నాగ‌బాబు స‌హా ఇరు తెలుగు రాష్ట్రాల్లో మెగాభిమానులు ఇందులో భాగంగా ఉన్నారు. రామ్ చ‌ర‌ణ్ - చిరంజీవి- క‌రోనా స‌మ‌యంలో జిల్లా కో ఆక్సిజ‌న్ బ్యాంక్ స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో నిరంత‌ర ఆక్సిజ‌న్ సేవ‌లు చేశారు.. 30కోట్లు ఖ‌ర్చు పెట్టారు సొంత డ‌బ్బు.. వాళ్లు ప్ర‌త్య‌క్ష దేవుళ్లు అనేందుకు అభిమానుల‌కు కానీ ల‌బ్ధి పొందిన ప్ర‌జ‌లకు కానీ ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సోనూ సూద్ సైతం క‌రోనా క‌ష్ట కాలంలో ఎంద‌రో కార్మికుల్ని ఆదుకుని గొప్ప దేవుడ‌య్యారు. ఉత్త‌రాదితో పాటు దేశవ్యాప్తంగా అత‌డికి ఉన్న ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ద‌క్షిణాదినా ఆయ‌న సాయం అందుకున్న‌వాళ్లు లేక‌పోలేదు.

క‌రోనా స‌మ‌యంలో ఇంచుమించు అంద‌రు హీరోలు బోలెడంత డ‌బ్బు సాయం చేశారు. విరివిగా ముఖ్య‌మంత్రుల నిధికి విరాళాల్ని అందించారు. చిరంజీవి కొన్ని వేల మంది కార్మికుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల్ని అందించారు. సినీకార్మికులు హైద‌రాబాద్ నుంచి వ‌ల‌స పోకుండా ఆప‌గ‌లిగారు. అలాగే ప‌రిశ్ర‌మ త‌ర‌పున ముఖ్య‌మంత్రుల్ని క‌లిసి సాయం అర్థించారు.

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌- బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రితో క్యాన్స‌ర్ రోగుల కోసం సేవ‌లందిస్తున్నారు. బ్ల‌డ్ బ్యాంక్ కూడా నిర్వ‌హిస్తూ ర‌క్తాన్ని సేక‌రించి క‌ష్టంలో ఉన్న‌వారికి అందిస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న‌దైన యూనిక్ మార్గంలో సామాజిక సేవ‌లు చేస్తున్నారు. పేద‌ పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్లు చేయిస్తూ మ‌నుషుల్లో దేవుడ‌య్యారు. ఇప్ప‌టికే మ‌హేష్‌ 1000 పైగా చిన్నారుల‌కు ప్రాణాలు పోసారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీని స్థాపించి రాజ‌కీయాల్లో ఉన్నారు. ఆయ‌న చాలాసార్లు అభిమానుల కుటుంబాలు క‌ష్టంలో ఉన్నాయంటే ఆదుకున్నారు. చేసిన ఆర్థిక సాయాల‌కు ప్ర‌చారాన్ని ఎప్పుడూ కోరుకోర‌ని స‌న్నిహితులు చెబుతారు. ఇక ప్ర‌కృతి వైప‌రీత్యాల్లో ప‌వ‌న్ ఎప్పుడూ గొప్ప సాయ‌మందించారు. కోట్లాది రూపాయ‌ల విరాళాల్ని అందించారు. హుదూద్ తుఫాన్ స‌మ‌యంలో కోట్ల‌లో విరాళ‌మిచ్చారు.

ఎన్టీఆర్ -చ‌ర‌ణ్ - అల్లు అర్జున్.. విశాల్ .. ఇలా హీరోలంతా విరివిగా దానాలిచ్చేందుకు ఎప్పుడూ వెన‌కాడ‌డం లేదు. గ‌తంలో క‌ష్ట‌కాలంలో సీఎం నిధికి కోట్ల‌లో దానాలిచ్చారు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు వ‌ర‌ద‌లు భూకంపాలు వ‌చ్చిన‌ప్పుడు కోట్ల‌లో విరాళాలిచ్చారు. ప్ర‌జ‌ల‌కోసం సీఎం నిధికి సాయ‌మందించ‌డ‌మే గాక‌.. ప్ర‌త్య‌క్షంగా అభిమానుల కుటుంబాల్ని క‌ష్టంలో ఆదుకునేందుకు ముందుకొచ్చారు. క‌మెడియ‌న్లు ఆలీ.. సునీల్ లాంటి వాళ్లు త‌మ‌వంతుగా సామాజిక సేవాకార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. మంచు కుటుంబ హీరోలు ప‌లుమార్లు త‌మ‌వంతు సామాజిక సేవ‌ల్లో పాలుపంచుకున్నారు. క‌రోనా క‌ష్ట కాలంలోనూ ప్ర‌జ‌ల్ని ఆదుకున్నారు. జ‌గ‌ప‌తి బాబు- గోపిచంద్ వంటి హీరోలు త‌మ‌వంతుగా సామాజిక సేవ‌లు చేసిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి.

మ‌నం మంచి కోణంలో చూస్తే సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఎంతో ఉంది. కానీ గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో నెగెటివ్ కోణానికే ఎక్కువ ఫోక‌స్ ఉంటుంది... నిజానికి వీళ్లే నిజ‌మైన సేవికులు.. సామాజిక సేవా బుద్ధి ఉన్న‌వాళ్లు.. సినీరంగంలో సేవాగుణానికి కార‌ణం ఇక్క‌డ భ‌గ‌వ‌ద్గీత - బైబిల్- ఖురాన్ ఎక్కువ చ‌దివేవాళ్లున్నార‌ని ఒక ప్ర‌ముఖుడు విశ్లేషించారు. అంతా తీసుకోవ‌డ‌మేనా కొంతైనా తిరిగి ఇచ్చేయాల‌న్న ప్ర‌వృత్తి మ‌న హీరోల‌కు ఉంద‌ని కూడా అన్నారు.

ఇండ‌స్ట్రియ‌లిస్టులు.. రాజ‌కీయ నాయ‌కులు .. బ‌డా వ్యాపారులు.. డాన్ బాస్కోలు వీళ్లు ఎవ‌రూ చేయ‌ని సాయాలు ప్ర‌జ‌ల కోసం చేసి నిజ‌మైన దేవుళ్లు అయ్యారు సినీ సెల‌బ్స్. అదీ సంగతి!!
Tags:    

Similar News