సీనియర్ హీరో, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సినిమా థియేటర్లలో సందడి చేసి చాలా కాలమే అవుతోంది. క్రియాశీల రాజకీయాల్లోకి కమల్ ప్రవేశించిన నేపథ్యంలో ఆయన దాదాపు నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు. దాంతో ఆయన నటించిన సినిమాలేవీ గడిచిన నాలుగేళ్లలో థియేటర్లలో సందడి చేయలేదు. దీంతో ఆయన నుంచి సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ కమల్ `విక్రమ్`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే భారీ స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, నరేన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ. 350 కోట్లు వసూళ్లని రాబట్టి ఆశ్చర్యపరిచింది. దీంతో కమల్ ఈ సక్సెస్ తో ఊహాల్లో తేలిపోతూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా క్లైమాక్స్ చివరి మూడు నిమిషాల సమయంలో హీకో సూర్య ఎంట్రీ కూడా అదరిపోయింది.
రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించిన తీరు, అతని పాత్ర మేకోవర్ పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా వుంటే ఈ చిత్రంలోని కీలక ఘట్టంలో టీనాగా నటించిన ఓ మహిళ విలన్ లకు చుక్కలు చూపించింది. ఒంటి చేత్తో విలన్ లని ఎదుర్కొంటూ వీరోచితంగా ఫైట్ చేసిన తీరు ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచింది. శివంగిలా విలన్ ల పైకి దూకి కేవలం ఫోర్క్లని ఆయుధాలుగా మలుచుకుని విరుచుకుపడిన తీరు హైలైట్ గా నిలిచింది.
కమల్ కొడుకు ఇంట్లో పని మనిషిగా వున్న టీనా వున్నట్టుండి టీనా రిపోర్టింగ్ సర్ అంటూ శివంగిలా రెచ్చిపోయి విలన్ లకు ముచ్చమటలు పట్టించడంతో ఇంతకీ ఎవరీ టీనా? అనే చర్చ మొదలైంది. దీంతో తాజాగా ఆమెకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి.
టీనాగా నటించిన మహిళ పేరు వాసంతి. ఆమె ఓ కొరియోగ్రాపర్. కోలీవుడ్ లో టాప్ స్టార్స్ నటించిన పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసింది. అయితే నటిగా ఆమె `విక్రమ్`తో పరిచయమైంది. తొలి చిత్రంలోనే అదరగొట్టేసిందని అంతా చెప్పుకుంటున్నారు.
`విక్రమ్`లో తను పోషించిన టీనా పాత్రకు లభిస్తున్న స్పందనపై స్పందించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. `విక్రమ్` వంటి మూవీలో తాను ఓ భాగం అయినందకు ఆనందంగా వుందని, అవకాశం ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపింది. అంతే కాకుండా తన అసలు పేరు వాసంతి అని, అయితే ఈ మూవీ చూసిన తరువాత చాలా మంది ఏజెంట్ టీనా అని పిలుస్తుంటే చాలా సంతోషంగా వుందని తెలిపింది.