కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ `జేమ్స్` ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా నాలుగు రోజుల్లే 100 కోట్ల క్లబ్ లో చేరింది. భారీ యాక్షన్ థ్రిల్లర్ కి కన్నడ అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు. స్టిల్ బాక్సాపీస్ వద్ద జేమ్స్ జోరు కొనసాగుతుంది. పునీత్ యాక్షన్ సన్నివేశాలో సోషల్ మీడియాలో లీకై ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. పునీత్ కి ఘనమైన నివాళిని ఈ సినిమా సక్సెస్ తో అభిమానులు అందించారు.
సినిమా సక్సెస్ లో భాగంగా పునీత్ బ్రదర్ నటుడు శివ రాజ్ కుమార్ అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సినిమా సక్సెస్ ని పునీత్ చూడకపోవడం దురదృష్టంకరమని కన్నీళ్లు చెమర్చారు. కానీ అభిమానుల గుండెల్లో పునీత్ ఎప్పటికీ సజీవంగానే ఉంటారన్నారు. తాజాగా `జేమ్స్` ఓటీటీలోనూ వండర్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. ఏప్రిల్ 15 నుంచి సోనీ లైవ్ లో ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
త్వరలోనే ఓటీటీ ప్రసారంపై సోనీ అధికారిక ప్రకటన చేయనుంది. దానికి సంబంధించిన ప్రోమోలు రెడీ చేస్తున్నట్లు సమాచారం. `జేమ్స్` చిత్రానికి చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. ఇంకా తెలుగు నటుడు శ్రీకాంత్ విలన్ పాత్రలో మెప్పించారు. అలాగే చరణ్ రాజ్ సంగీతం అందివ్వగా కిషోర్ పత్తికొండ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా నిర్మాణానికే 70-80 కోట్లు ఖర్చు అయిందని సమాచారం.
ఈ సినిమాలో పునీత్ పాత్రకి శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. చిత్రీకరణ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా శివరాజ్ కుమార్ మరణించడంతో డబ్బింగ్ బాధ్యతలు శివ రాజ్ కుమార్ తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ నటించిన `గాంధాడ గుడి`..`లక్కీ మ్యాన్` చిత్రాలు ఇంకా సెట్స్ లోనే ఉన్నాయి. పునీత్ మరణంతో ఆ సినిమాలు మద్యలోనే నిలిచిపోయాయి. వాటని కూడా శివ రాజ్ కుమార్ పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పనులకు సంబంధించి మేకర్స్ శఙవ రాజ్ కుమార్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.
పునీత్ మంచి నటుడే కాదు. అంతకు మించి గొప్ప మానవతా వాది. సేవా దృక్ఫథం గల వ్యక్తి. ఎన్నో చారిటీలు..వృద్ధాశ్రమాలు నిర్వహించారు. ఎంతో మంది అనాధ బాలల్ని చదవించారు. అలా ఓ నటుడిగా కన్నా గొప్ప మనసున్న వ్యక్తిగా దేశ వ్యాప్తంగా పేరుగాంచారు. పునీత్ భౌతికంగా లేకపోయినా ప్రేక్షకుల గుండెల్లో చిర్థాయిగానే ఉంటారు.