'హ్యాపీ బర్త్ డే' పార్టీ సాంగ్.. స్టన్నింగ్ లుక్ లో ఆకట్టుకున్న లావణ్య..!
'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''హ్యాపీ బర్త్ డే''. అందాల లావణ్య త్రిపాఠి నటిస్తున్న ఈ సినిమాలో.. నరేష్ అగస్త్య - సత్య - వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సర్రియల్ కామెడీ థ్రిల్లర్ కు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
పాన్ తెలుగు ఫిలింగా డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో 'హ్యాపీ బర్త్ డే' చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అలానే ఎస్ఎస్ రాజమౌళి లాంచ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కు అన్ని మూలల నుండి మంచి స్పందన లభించింది.
ఈ క్రమంలో తాజాగా మేకర్స్ పార్టీ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇది ఈ ఏడాది ఏకైక లీగల్ పార్టీ సాంగ్ గా పేర్కొన్నారు. 'ఏదో మైకంలో తెలిపోతుంటే.. తూలి పోతుంటే ఈవేళ.. తేరా మేరా లే అంటూ.. తేడాలే లేక సాగాలే ఈపైనా..' అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది.
కాల భైరవ ఈ పార్టీ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ రాయగా.. సింగర్ దామిని భట్ల హుషారుగా ఆలపించారు. విజువల్ గానూ హ్యాపీ బర్త్ డే పార్టీ సాంగ్ కలర్ ఫుల్ గా ఉంది. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
పార్టీ సాంగ్ లో లావణ్య త్రిపాఠి డ్యాన్స్ మూవ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పార్టీ థీమ్ కు తగ్గట్లుగా ఆమె ధరించిన ట్రెండీ కాస్ట్యూమ్స్ లో స్టన్నింగ్ గా కనిపించింది. లావణ్య తన హాట్ నెస్ తో బిగ్ స్క్రీన్ పై మంట పుట్టిస్తుందేమో చూడాలి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రీ) - హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. 'హ్యాపీ బర్త్ డే' సినిమా జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
Full View