ఆ ఛాన్స్ లావణ్య పట్టేసింది

Update: 2016-02-11 07:30 GMT
భలే భలే మగాడివోయ్ - సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌ బస్టర్లు కొట్టింది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ఆమె కొత్త సినిమా ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అడ్రస్ లేకుండా పోయినా.. ఆమెకు ఆఫర్లకయితే కొదవ లేదు. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తూనే.. తాజాగా ఇంకో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది లావణ్య. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టేస్తుండటం విశేషం. సందీప్ కిషన్ హీరోగా తమిళ దర్శక నిర్మాత సీవీ కుమార్ ఓ సైఫై థ్రిల్లర్ ఒకటి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ద్విభాషా చిత్రంలో ముందు తెలుగు - తమిళ భాషల్లో ప్రేక్షకులకు పరిచయమున్న తాప్సిని అనుకున్నారు.

ఐతే ఏం జరిగిందో ఏమో కానీ.. ఈ మధ్య తాప్సి ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఆ స్థానంలోకి లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్లు సమాచారం. లావణ్యకు ఇదే తొలి సినిమా కాబోతుండటం విశేషం. తమిళంలోనూ హీరోయిన్ల కొరత బాగా ఉంది కాబట్టి.. లావణ్యకు తెలుగులో లాగే లక్కు కలిసొస్తే అక్కడా బిజీ అయ్యే అవకాశముంటుంది. సందీప్ కిషన్ ప్రస్తుతం తెలుగులో అని కన్నెగంటి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అది తమిళ హిట్ మూవీ ‘నేరమ్’కు రీమేక్. సీవీ కుమార్ తమిళంలో నిర్మాతగా సెన్సేషనల్ మూవీస్ తీశాడు. దర్శకుడిగా మారుతూ  మన సందీప్ కిషన్ ను హీరోగా ఎంచుకోవడం విశేషమే.
Tags:    

Similar News