బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కమార్ - కైరా అద్వానీ జంటగా నటించిన కామెడీ హార్రర్ చిత్రం ''లక్ష్మీ బాంబ్''. కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాఘవ లారెన్స్ - శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ''కాంచన'' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ కరోనా కారణంగా కుదరలేదు. అయితే ఇప్పుడు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దీపావళి కానుకగా నవంబర్ 9న 'లక్ష్మీ బాంబ్' విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
భూతాలు దెయ్యాల గురించి భయపడే ఓ యువకుడికి అనుకోకుండా దెయ్యం పట్టుకుంటే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ తో కామెడీ హారర్ కి సందేశాన్ని జతచేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దక్షిణాది ప్రేక్షకులు ఆల్రెడీ చూసిన సినిమానే కాబట్టి ఈ ట్రైలర్ లో 'కాంచన' చూస్తున్న ఫీలింగ్ కలగడం సహజం. అయితే అక్షయ్ కుమార్ తన అద్భుతమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. విభిన్న షేడ్స్ లో కనిపించడంతో పాటు ట్రాన్స్ జెండర్ గా కూడా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అమర్ మోహిలే ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు తనీష్ బాగ్చీ - శశీ ఖుషీ - అనూప్ కుమార్ ఇచ్చిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ చిత్రంతో రాఘవ లారెన్స్ బాలీవుడ్ డెబ్యూ సాలిడ్ గా ఉండనుందని తెలుస్తోంది. మొత్తం మీద హిందీ 'కాంచన' ట్రైలర్ బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కాగా, ఈ చిత్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ - ఫాక్స్ స్టార్ స్టూడియోస్ - షబీనా ఎంటర్‌టైన్‌మెంట్ - తుషార్ ఎంటర్‌టైన్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన సినిమాల్లో భారీ బడ్జెట్ మూవీ 'లక్ష్మీబాంబ్' అని చెప్పవచ్చు. నవంబర్ 9న ఓటీటీలో పేలనున్న ఈ 'లక్ష్మీబాంబ్' ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.
Full View