#2020 పాన్ ఇండియా సిన్మాల‌కు లీకుల‌ బెంగ‌

Update: 2020-02-03 04:34 GMT
2020 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలు `ఆర్ ఆర్ ఆర్`- `కేజీఎఫ్‌-2` సంచ‌నాల‌కు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాల‌కు ఊహించ‌ని ముప్పు మేక‌ర్స్ కి త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా మారుతోంది. ఆన్ లొకేష‌న్ నుంచి ర‌క‌ర‌కాల‌ లీకులు ఇప్ప‌టికే ఇబ్బందిక‌రంగా మారాయి. ఆర్.ఆర్.ఆర్ సెట్స్ నుంచి ఇంత‌కుముందు ఓ వీడియో లీకై సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. అటు పై బ‌ల్గేరియా అడ‌వుల్లో తార‌క్ పులితో త‌ల‌ప‌డుతున్న స‌న్నివేశం చిత్రీ క‌ర‌ణ‌కు సంబంధించిన మ‌రో వీడియో లీకైంది. అలాగే ఎంత దాచాల‌నుకున్నా చ‌ర‌ణ్.. తార‌క్ గెట‌ప్ లు కూడా లీక‌య్యాయి. ప్ర‌ధాన కాస్టింగ్ కొత్త ఫోటోలు యూనిట్ అధికారికంగా రిలీజ్ చేయ‌కుండానే అంత‌ర్జాలంలోకి వ‌చ్చేశాయి.

మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్‌-2 కి ఈ త‌ర‌హా స‌మ‌స్య త‌ప్ప‌డం లేదు. ఇందులో హీరోగా న‌టిస్తున్న క‌న్న‌డ రాక్ స్టార్ యశ్ వీడియో ఒక‌టి తాజాగా లీకైంది. అత‌డు బ్లాక్ సూట్ లో ఇన్ఫోసిస్ గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ ముందు నుంచి న‌డుచుకుంటూ వ‌స్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయింది. ఇంకా మ‌రికొన్ని లీక్డ్ ఫోటోలు యూనిట్ ని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. లీకుల‌తో ఫ్యాన్స్ ఖుషీ అయినా స‌స్పెన్స్ ఓపెన్ అయిపోతుండ‌డం ఇబ్బందిక‌రంగా మారింద‌ని ప్ర‌శాంత్ నీల్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇవి రెండూ పాన్ ఇండియా కేట‌గిరీలో భారీ బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కుతున్నచిత్రాలు. దాదాపు అన్ని భాష‌ల్లోనూ అభిమానులు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తుంటే..ఇలాంటి అన‌వ‌స‌ర లీకులు క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. అధికారిక‌ రిలీజ్ కు ముందే వీడియోలు..ఫోటోలు బ‌య‌ట‌కు వచ్చేస్తే సినిమాకి అది స‌మ‌స్యాత్మ‌క‌మే కాబ‌ట్టి దీనిపై సీరియ‌స్ గానే ఆలోచిస్తున్నార‌ని సమాచారం. ఇక ఇంత‌కుముందు సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించిన ఎంద‌రో నిర్మాత‌ల త‌ర‌హాలోనే డీవీవీ సంస్థ‌.. హోంబ‌లే సంస్థలు కేర్ తీసుకోవాల్సి ఉంటుందేమో!


Tags:    

Similar News