బాహుబలికి హాలీవుడ్ ఫైట్స్ హంగులు

Update: 2016-04-10 17:12 GMT
బాహుబలి ది బిగినింగ్ సృష్టించిన సంచలనాల తర్వాత.. సీక్వెల్ కోసం చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి. ముఖ్యంగా ఈ రెండో భాగంలో స్టోరీ నడిపించడంతో పాటు బాహుబలి తొలి భాగానికి మించిన వార్ ఎపిసోడ్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు.

బాహుబలి ది కంక్లూజన్ లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు.. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లీ విటాకర్ ను తీసుకున్నారు. ఇతను పెరల్ హార్బర్ - జురాసిక్ పార్క్ - ది స్పై నెక్ట్స్ డోర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను స్టంట్స్ - ఫైట్స్ సమకూర్చిన అనుభవం ఉంది. లీ విటాకర్ ఎంట్రీ తర్వాత.. బాహులి ది కంక్లూజన్ ఫైట్ సీన్స్ చిత్రీకరణలో చాలా ఛేంజ్ వచ్చిందని అంటున్నారు.

ప్రస్తుతంలోనే బాహుబలి రెండో భాగం షూటింగ్ జరుగుతోంది. రెండు యూనిట్లుగా ఏర్పడి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చాలా సార్లు నైట్ ఎపిసోడ్స్ కూడా తీస్తున్నారట. ముఖ్యంగా ఈ నైట్ టైమ్ ఫైట్స్ ను లీ విటాకర్ దగ్గరుండి తెరకెక్కిస్తున్నాడట. బాహుబలి పాత్రధారి ప్రభాస్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అన్ని రకాలుగాను సిద్ధం చేసుకుని 2017 ఏప్రిల్ 15న బాహుబలి ది కంక్లూజన్ ను రిలీజ్ చేయనున్నారు.
Tags:    

Similar News