తమిళ అగ్రహీరో సూర్య తాజాగా నటించి విడుదల చేసిన జై భీమ్ ప్రేక్షకులు -విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇది జస్టిస్ చంద్రు వాదించిన నిజ జీవిత కేసు నుంచి ప్రేరణ పొందింది. ఇదిలా ఉండగా, వన్నియార్ కమ్యూనిటీని పరువు తీశారనే ఆరోపణలతో ఈ చిత్రం ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది.
జై భీమ్ చిత్రంలో హీరోగా సూర్య నటించాడు. ఈ చిత్రానికి సూర్య ఆయన భార్య జ్యోతిక కలిసి నిర్మాతగా వ్యవహరించారు. టిజే జ్ఞానవేల్ దర్శకుడు. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ విడుదలైంది. తాజాగా అమెజాన్ కు వన్నియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అరుల్మొళి లీగల్ నోటీసు జారీ చేశారు.
"వన్నియార్ కమ్యూనిటీ.. దాని ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా తప్పుడు, హానికరమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం లేదా ప్రచురించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని.. సినిమా నుంచి ఆ సన్నివేశాలు తీసివేయాలని" నోటీసుల్లో వన్నియర్ సంఘం కోరింది.
ఈ మేరకు పరువు నష్టం కింద నష్టపరిహారం చెల్లించాలని కూడా నోటీసులో కోరారు. 5 కోట్లు అది నోటిసు అందిన సమయం, తేదీ నుంచి ఏడు రోజులలో చెల్లించాలన్నారు. సినిమాలో యథార్థ కథతో పాటు నిజమైన వ్యక్తులను చిత్రీకరించినప్పటికీ, నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా రాజకన్నును హింసించే పోలీసు పేరును మార్చారని ఆరోపించారు.
“సినిమాలోని వాస్తవ ఘటనలోని నిజమైన పాత్రల అసలు పేర్లను మీరు అలాగే ఉంచుకున్నారని మా క్లయింట్ పేర్కొన్నాడు. కానీ ఉద్దేశపూర్వకంగా మీరు సబ్-ఇన్‌స్పెక్టర్ పేరును మార్చారు. అసలు కథలో అండర్ ట్రయల్ కస్టడీ మరణంలో పాల్గొన్న సబ్-ఇన్‌స్పెక్టర్‌ని ఆంథోనిసామి అని పిలుస్తారు, అతను మతం ప్రకారం క్రైస్తవుడు, ”అని నోటీసులో పేర్కొంది.
జైభీమ్ సినిమాలో ఇన్‌స్పెక్టర్ ఇంటి వద్ద 'అగ్ని కుడం' వన్నియార్ సంగం గుర్తుతో కూడిన క్యాలెండర్‌ను కూడా ఉంచారని, అతను వన్నియార్ కమ్యూనిటీకి చెందినదని స్పష్టంగా సూచిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. "వన్నియార్ సంఘం సభ్యులను పరువు తీయడంతోపాటు మొత్తం వన్నియార్ సమాజం ప్రతిష్టను దెబ్బతీయాలనే దుర్మార్గపు ఉద్దేశ్యంతో ఇది జరిగింది" అని నోటీసులో పేర్కొన్నారు.
ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. సూర్యకు సపోర్ట్ గా ‘వీ స్టాండ్ విత్ సూర్య’ అనే హ్యాట్ ట్యాగ్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది.
సినిమాలోని మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశం మార్చినప్పటికీ క్యాలెండర్ వివాదం సద్దు మణగలేదు. ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది.
ఈ క్రమంలోనే కుల వర్గాలను రెచ్చగొట్టి, అ ల్లర్లను సృష్టిస్తున్న ‘జైభీమ్’ నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకే మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం నేతృత్వంలోని బృందం అక్కడి పోలీస్ సూపరిటెండెంట్ కు వినతిపత్రం సమర్పించింది. కుల అల్లర్లను రెచ్చిగొట్టి వన్నీ వన్నియర్ కమ్యూనిటిని అవమానించిన నటుడు సూర్య ‘మైలాడుతురై ’ జిల్లా వస్తే అతడిపై దాడి చేసిన యువకులకు పార్టీ తరుఫున లక్ష రూపాయల బహుమతి ఇస్తామని సంచలన ప్రకటన చేసింది.
ఈ క్రమంలోనే మైలాడుతురైలో నటుడు సూర్య సినిమా ప్రదర్శనను నిరసిస్తూ ప్రజలు నిరసనకు దిగారు. దీంతో అక్కడి థియేటర్లలో సినిమాను ప్రదర్శించడం నిలిపివేశారు. సూర్యదాడికి ఏకంగా లక్ష రివార్డు ప్రకటించడం సంచలనమైంది.
కొన్ని రోజుల క్రితమే ఒక నిర్దిష్ట సమాజాన్ని కించపరిచే ఉద్దేశ్యం తమకు లేదని సూర్య స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ వన్నియార్ సంఘం పెద్దలు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. మరి ఈ లీగల్ ఆరోపణలపై సూర్య అండ్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.