ఇండియా (X) పాక్‌: కార్గిల్ వార్ లో దిలీప్ కుమార్ స‌యోధ్య‌

Update: 2021-07-08 03:30 GMT
భార‌త్-పాకిస్థాన్ దేశాల మ‌ధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. అర్ధ‌శ‌తాబ్ధానికి పైగా ఇరు దేశాల మ‌ధ్య నువ్వా?  నేనా? అన్న‌ట్లు దాయాది పోరు సాగుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు యుద్ధ వాతావ‌ర‌ణం చూస్తూనే ఉన్నాం.  స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి రెండు దేశాలు స‌రిహ‌ద్దుల వివాదం ఏ స్థాయిలో కొన‌సాగుతుందో విధిత‌మే. ఇరు దేశాల ప్ర‌ధానుల మ‌ధ్య ఎన్నోసార్లు చ‌ర్చోపచ‌ర్చ‌లు సాగినా అవి విఫ‌లం కావ‌డం ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతున్న‌దే. భార‌త‌దేశ మొద‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ద‌గ్గ‌ర నుంచి నేడు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న న‌రేంద్ర మోదీ వ‌ర‌కూ శ‌త్రు దేశంతో ఢీ కొన‌సాగిస్తూనే ఉన్నారు.

అయితే ఇలాంటి వివాదంలో బాలీవుడ్ లెజండ‌రీ న‌టుడు దిలీప్ కుమార్ స‌యోధ్య కుదిర్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది.  1999 లో పాకిస్తాన్ లాహోర్ స‌మావేశానికి  భార‌త్ ని అహ్వానించిన‌ప్ప‌టికీ.. మ‌రోవైపు పాక్ కుటిల బుద్దిని పోనిచ్చుకోలేదు. ఓవైపు లాహోర్ స‌మావేశం జ‌రుపుతూనే మ‌రోవైపు కార్గిల్ వార్ కి తెర తీసింది. ఆ స‌మ‌యంలోనే అప్పటి ప్ర‌ధాని అటల్ బిహ‌ర్ వాజుపాయి పాకిస్తాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీప్ కు ఫోన్ చేసారు. ఇదేం బాగోలేదంటూ వాజుపాయి చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. మీరేం మాట్లాడుతున్నారో మాకేం అర్ధం కాలేదంటూ ఆయ‌న మా సైన్యాధిప‌తితో మాట్లాడుతాన‌ని అన్నారు. వాజ్  పాయి ఫోన్ మాట్లాడుతోన్న స‌మ‌యంలో బాలీవుడ్ న‌టుడు దిలీప్ క‌మార్ ఆయ‌న ప‌క్క‌నే ఉన్నారుట‌. వాజుపాయి వెంట‌నే మీతో ఓ వ్య‌క్తి మాట్లాడుతాన‌ని... అత‌ను మీకు బాగా తెలిసిన వ్య‌క్తి.. మీరు మాట్లాడండి అంటూ ఆ ఫోన్ కాల్ ని దిలీప్ కుమార్ కు ఇచ్చారు.

సాహెబ్ మీ నుంచి మేము ఇలాంటివి ఆశించ‌డం లేదు. ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌మైతే భార‌త్ లో ముస్లీంల ప‌రిస్థితి మ‌రింత జ‌ఠిల‌మ‌వుతుంది. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దండ‌ని కోరారు.  అలా పాక్-భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న వైరానికి దిలీప్ కుమార్ తాత్కాలికంగా బ్రేకులు వేయ‌గ‌లిగారు. ఈ విష‌యాన్ని పాకిస్తాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మ‌హ్మ‌ద్ క‌సూర్ త‌న ఆత్మ‌క‌థ అయిన‌ `నైద‌ర్ ఏ హాక్ నార్ డ‌వ్` లో చెప్పుకొచ్చారు.  దిలీప్ కుమార్ పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చి స్థిరప‌డిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News