లెజెండ్రీ స్టార్ దిలీప్ కుమార్‌ కు హైదరాబాద్ తో చేదు అనుబంధం

Update: 2021-07-08 15:30 GMT
బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం పాటు స్టార్‌ గా కొనసాగిన దిలీప్ కుమార్‌ మృతి దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు షాక్‌ మిగిల్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సెలబ్రెటీలు మరియు ఆయనతో అనుబంధం ఉన్న వారు ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. దిలీప్ కుమార్‌ కు దేశంలో ప్రతి మూల కూడా అభిమానులు ఉంటారు. అలాగే ఆయనకు దేశంలో అనేక చోట్ల షూటింగ్ ల్లో పాల్గొన్న అనుబంధం ఉంటుంది. కాని హైదరాబాద్ కు అంతకు మించిన అనుబంధం ఉంది. అయితే ఆ అనుబంధం గురించి ఆయన మాట్లాడుకునేందుకు కూడా ఇష్టపడరట.

వివరాల్లోకి వెళ్తే... అప్పట్లో దిలీప్ కుమార్‌ హైదరాబాద్‌ కు వచ్చిన సమయంలో అస్మా బేగం అనే మహిళను కలుస్తూ ఉండేవారట. తన చెల్లి ద్వారా అస్మా బేగం పరిచయం ఏర్పడింది. అస్మా బేగం ను ప్రేమించిన దిలీప్‌ కుమార్‌ తన భార్య సైరా బానుకు తెలియకుండా పెళ్లికి సిద్దం అయ్యాడట. 1980 సంవత్సరంలో కొన్ని కారణాల కారణంగా అస్మా బేగం ను దిలీప్‌ కుమార్‌ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అస్మా ను హైదరాబాద్‌ లోనే ఉండాలని కండీషన్ పెట్టాడట. అలాగే తన మొదటి భార్య సైరా బానుకు రెండవ పెళ్లి విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడట. కాని అస్మా బేగం మాత్రం ముంబయికి మకాం మార్చి దిలీప్ కుమార్‌ ఇంటికి సమీపంలోనే ఉంటూ ఆయనతో తనకు పెళ్లి అయిన విషయాన్ని మీడియా ద్వారా చెప్పడం మొదలు పెట్టిందట.

దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ వివాదం కొనసాగింది. సైరా బాను పలువురు బాలీవుడ్‌ ప్రముఖుల వద్దకు వెళ్లి దిలీప్ కుమార్‌ కు సంబంధించిన విషయంలో రాజీ కుదిర్చేందుకు కోరింది. ఈ విషయాన్ని అప్పటి కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఎన్సీపీ అధినేత అయిన శరత్‌ పవార్ మద్యవర్తిత్వం వహించాడు. అస్మా బేగం కు దిలీప్ కుమార్‌ కు 1983 లో విడాకులు ఇచ్చేలా ఒప్పించాడు. అస్మాకు అందుకు గాను భారీ మొత్తంలోనే ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి. విడాకుల తర్వాత కెనడా లో సెటిల్ అయిన ఆమె మళ్లీ ఎప్పుడు కూడా దిలీప్ కుమార్ తో ఆమె మాట్లాడింది లేదు.
Tags:    

Similar News