లెజెండ్రీ స్టార్‌ తనయుడి మరో భారీ ప్రాజెక్ట్‌

Update: 2021-06-28 09:30 GMT
బాలీవుడ్‌ లెజెండ్రీ స్టార్‌ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. ఆయన మృతి చెంది ఏడాది దాటినా కూడా ఆయన జ్ఞాపకాల్లోనే అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలతో ఆయన బతికే ఉన్నాడంటూ అభిమానులు ఆయన్ను తల్చుకుంటు ఉన్నారు. ఈ సమయంలో ఆయన తనయుడు బాబిల్ ఖాన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇర్ఫాన్‌ ఖాన్ కు తన కొడుకు బాబిల్ ను హీరోగా చేయాలనే కోరిక. అందుకే ఆయన ఉన్న సమయంలోనే యాక్టింగ్‌ కోర్సులో జాయిన్‌ చేశాడు. విదేశీ యూనివర్శిటీలో యాక్టింగ్‌ తో పాటు ఫిల్‌ మేకింగ్‌ లో ట్రైనింగ్‌ తీసుకున్న బాబిల్ ఖాన్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.

బాలీవుడ్‌ లో నెట్‌ ఫ్లిక్స్ వారు 'ఖాలా' పేరుతో బాబిల్ ఖాన్‌ హీరోగా సినిమాను నిర్మించారు. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌ లో అవకాశంను బాబిల్ ఖాన్‌ దక్కించుకున్నాడు. బాలీవుడ్‌ స్టార్ ఫిల్మ్‌ మేకర్‌ షూజిత్ సిర్కార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుంది. గతంలో షూజిత్ సిర్కార్ దర్శకత్వంలో ఇర్ఫాన్ ఖాన్ నటించాడు. 2015 సంవత్సరంలో వచ్చిన పీకూ సినిమా ఇర్ఫాన్ కు మంచి సక్సెస్ ను తెచ్చి పెట్టింది.

తండ్రికి సక్సెస్‌ అందించిన షూజిత్ సిర్కార్ దర్శకత్వంలో బాబిల్ ఖాన్ నటించేందుకు సిద్దం అయిన నేపథ్యంలో బాలీవుడ్‌ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఖచ్చితంగా సినిమా బాబిల్ ఖాన్‌ ను స్టార్‌ గా మార్చుతుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమా విడుదల విషయమై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News